తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద
(॥పల్లవి॥)
తెలియఁ జీకటికి దీపమెత్తక పెద్ద-
వెలుఁగు లోపలికి వెలుఁగేలా
(॥తెలియ॥)
అరయ నాపన్నుని కభయ మీవలెఁగాక
ఇరవైనసుఖిఁ గావనేలా
వఱతఁబోయెడివాని వడిఁ దీయవలెఁగాక
దరివానిఁ దివియంగఁ దానేలా
(॥తెలియ॥)
ఘనకర్మారంభునికట్లు విడవలెఁగాక
యెసి మునక్తునిఁ గావనేలా
అనయము దుర్బలుని కన్నమిడవలెఁగాక
తనసినవానికిఁ దానేలా
(॥తెలియ॥)
మితిలేనిపాపకర్మికిఁ దా వలెఁగాక
హితవెఱుఁగుపుణ్యుని కేలా
ధృతి హీనుఁ గృపఁ జూచి తిరువేంకటేశ్వరుఁడు
తతిఁ గావకుండినఁ దానేలా
(||pallavi||)
tĕliyam̐ jīgaḍigi dībamĕttaga pĕdda-
vĕlum̐gu lobaligi vĕlum̐gelā
(||tĕliya||)
araya nābannuni kabhaya mīvalĕm̐gāga
iravainasukhim̐ gāvanelā
vaṟadam̐boyĕḍivāni vaḍim̐ dīyavalĕm̐gāga
darivānim̐ diviyaṁgam̐ dānelā
(||tĕliya||)
ghanagarmāraṁbhunigaṭlu viḍavalĕm̐gāga
yĕsi munaktunim̐ gāvanelā
anayamu durbaluni kannamiḍavalĕm̐gāga
tanasinavānigim̐ dānelā
(||tĕliya||)
midilenibābagarmigim̐ dā valĕm̐gāga
hidavĕṟum̐gubuṇyuni kelā
dhṛti hīnum̐ gṛpam̐ jūsi tiruveṁkaḍeśhvarum̐ḍu
tadim̐ gāvaguṁḍinam̐ dānelā