Telisinavaarigidi tenegamtem deebulu

తెలిసినవారికిది తేనెకంటెఁ దీపులు
Language

(॥పల్లవి॥)
తెలిసినవారికిది తేనెకంటెఁ దీపులు
వలసితేఁ జేకొనవే వనితరో నీవు

(॥తెలిసి॥)
నేరిచినవారికి నీడవంటిది మోహము
నేరనివారికి నెండ వెన్నెలవంటిది
కూరిమి గొసరితేను కోపము చెల్లదిందుకు
మేరమీరినఁ దమలో మెచ్చవలెఁ గాని

(॥తెలిసి॥)
వోపనవారికి వయసోడబేరము వంటిది
వోపినివారికి వేఁటవుచ్చువంటిది
చేపట్టి తీసితేను సిగ్గులువడఁ దగదు
పై పైఁ గూడిన బాఁతిపడవలెఁ గాని

(॥తెలిసి॥)
కూడినవారికి రతి కొట్టిన పిండివంటిది
కూడనివారికి కలగూరవంటిది
యీడుజోడై శ్రీ వేంకటేశుఁడిదె నిన్నుఁగూడీ
వేడుకతోఁ జెప్పినట్టు వినవలెఁగాని

(||pallavi||)
tĕlisinavārigidi tenĕgaṁṭĕm̐ dībulu
valasidem̐ jegŏnave vanidaro nīvu

(||tĕlisi||)
nerisinavārigi nīḍavaṁṭidi mohamu
neranivārigi nĕṁḍa vĕnnĕlavaṁṭidi
kūrimi gŏsaridenu kobamu sĕlladiṁdugu
meramīrinam̐ damalo mĕchchavalĕm̐ gāni

(||tĕlisi||)
vobanavārigi vayasoḍaberamu vaṁṭidi
vobinivārigi vem̐ṭavuchchuvaṁṭidi
sebaṭṭi tīsidenu sigguluvaḍam̐ dagadu
pai paim̐ gūḍina bām̐tibaḍavalĕm̐ gāni

(||tĕlisi||)
kūḍinavārigi radi kŏṭṭina piṁḍivaṁṭidi
kūḍanivārigi kalagūravaṁṭidi
yīḍujoḍai śhrī veṁkaḍeśhum̐ḍidĕ ninnum̐gūḍī
veḍugadom̐ jĕppinaṭṭu vinavalĕm̐gāni