Telisinavaamdaam gaanu teliyanivaamdaam gaanu

తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను
Language

(॥పల్లవి॥)
తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను
యిల నొకమాట నీ కెత్తిచ్చితిఁగాని

(॥తెలి॥)
పుట్టించేవాఁడవు నీవే బుద్ధిచ్చేవాఁడవు నీవే
యెట్టున్నా నపరాధా లేవి మాకు
అట్టూ నన్నవారముగా మనఁగా నీచి త్తమెట్టో
కిట్టి వొకమాట మడిగితి నింతేకాని

(॥తెలి॥)
మనసులోపల నీవే మరి వెలుపల నీవే
యెనసి అపరాధాలు యేవి మాకు
నిను నౌఁగాదనలేము నీ సరివారముఁ గాము
అనవలసినమాట అంటి మింతే కాని

(॥తెలి॥)
అంతరాత్మవును నీవే అన్నిటాఁ గావఁగ నీవే
యెంతైనా నపరాధా లేవి మాకు
వింత లేక శ్రీవేంకటవిభుఁడ నీబంట నింతే
వంతుకు నేనొకమాట వాకుచ్చితిఁగాని

(||pallavi||)
tĕlisinavām̐ḍām̐ gānu tĕliyanivām̐ḍām̐ gānu
yila nŏgamāḍa nī kĕttichchidim̐gāni

(||tĕli||)
puṭṭiṁchevām̐ḍavu nīve buddhichchevām̐ḍavu nīve
yĕṭṭunnā nabarādhā levi māgu
aṭṭū nannavāramugā manam̐gā nīsi ttamĕṭṭo
kiṭṭi vŏgamāḍa maḍigidi niṁtegāni

(||tĕli||)
manasulobala nīve mari vĕlubala nīve
yĕnasi abarādhālu yevi māgu
ninu naum̐gādanalemu nī sarivāramum̐ gāmu
anavalasinamāḍa aṁṭi miṁte kāni

(||tĕli||)
aṁtarātmavunu nīve anniḍām̐ gāvam̐ga nīve
yĕṁtainā nabarādhā levi māgu
viṁta lega śhrīveṁkaḍavibhum̐ḍa nībaṁṭa niṁte
vaṁtugu nenŏgamāḍa vāguchchidim̐gāni