తెలిసినదే నేము తేటతెల్లమిగా నిది
(॥పల్లవి॥)
తెలిసినదే నేము తేటతెల్లమిగా నిది
అలవాటు సేసేవు అందుకేమి లేవయ్యా
(॥తెలి॥)
మంతనాన నతులకు మాయింటికాడనే
బంతిఁ బెట్టి వలపులు పంచిపెట్టేవు
యింతకోపినాఁటదైతే యియ్యకొనీఁగాక మమ్ము
అంత యేల లోఁచేవు అందుకేమిలేవయ్యా
(॥తెలి॥)
యిక్కువ నాపానుపుపై యేడవారిఁ దెచ్చి పెట్టి
వెక్సపుటాసలెల్ల వెదవెట్టేవు
అక్కరగలదియైతే నందుకొనీ యీచేఁత
అక్కుమీఁదికిఁ దీసే వందుకేమిలేవయ్యా
(॥తెలి॥)
వాసులనీకాఁగిటిలో వారివీరిరతులెల్లా
బేసబెల్లితనానను పేరుకొనేవు
వేసరక నన్నిట్టె శ్రీవేంకటేశ కూడితివి
ఆసుద్దులే యీసుద్దులు అందుకేమిలేవయ్యా
(||pallavi||)
tĕlisinade nemu teḍadĕllamigā nidi
alavāḍu sesevu aṁdugemi levayyā
(||tĕli||)
maṁtanāna nadulagu māyiṁṭigāḍane
baṁtim̐ bĕṭṭi valabulu paṁchibĕṭṭevu
yiṁtagobinām̐ṭadaide yiyyagŏnīm̐gāga mammu
aṁta yela lom̐sevu aṁdugemilevayyā
(||tĕli||)
yikkuva nābānububai yeḍavārim̐ dĕchchi pĕṭṭi
vĕksabuḍāsalĕlla vĕdavĕṭṭevu
akkaragaladiyaide naṁdugŏnī yīsem̐ta
akkumīm̐digim̐ dīse vaṁdugemilevayyā
(||tĕli||)
vāsulanīgām̐giḍilo vārivīriradulĕllā
besabĕllidanānanu perugŏnevu
vesaraga nanniṭṭĕ śhrīveṁkaḍeśha kūḍidivi
āsuddule yīsuddulu aṁdugemilevayyā