Telisina panulagu dega ninnu

తెలిసిన పనులకు దెగ నిన్ను
Language

(॥పల్లవి॥)
తెలిసిన పనులకు దెగ నిన్ను
సొలపుఁ జూపులనె చూచితి నిన్ను

(॥॥)
నామతిలో నున్నవి నీవాడఁగ
యేమని కొసరే నిఁక నిన్ను
మోము చూచితే మొగి నిటు నవ్వఁగ
కామించి యలుగఁగఁ గలనా నిన్ను

(॥॥)
పిలువకతొల్లే ప్రియమున రాఁగా
వలెనా రమ్మన వడి నిన్ను
పలికినంతనే పంతము లియ్యఁగ
చలములు సాధించఁ జాలము నిన్ను

(॥॥)
అంటకతొల్లే అంగము గరఁగఁగ
కంటకమేల యిక్కడ నిన్ను
యింటనే శ్రీ వేంకటేశ కూడితివి
వెంట వెంట నిఁక విడువను నిన్ను

(||pallavi||)
tĕlisina panulagu dĕga ninnu
sŏlabum̐ jūbulanĕ sūsidi ninnu

(||||)
nāmadilo nunnavi nīvāḍam̐ga
yemani kŏsare nim̐ka ninnu
momu sūside mŏgi niḍu navvam̐ga
kāmiṁchi yalugam̐gam̐ galanā ninnu

(||||)
piluvagadŏlle priyamuna rām̐gā
valĕnā rammana vaḍi ninnu
paliginaṁtane paṁtamu liyyam̐ga
salamulu sādhiṁcham̐ jālamu ninnu

(||||)
aṁṭagadŏlle aṁgamu garam̐gam̐ga
kaṁṭagamela yikkaḍa ninnu
yiṁṭane śhrī veṁkaḍeśha kūḍidivi
vĕṁṭa vĕṁṭa nim̐ka viḍuvanu ninnu