Telisidimi neesuddi devaravu gadaraa

తెలిసితిమి నీసుద్ది దేవరవు గదరా
Language

(॥పల్లవి॥)
తెలిసితిమి నీసుద్ది దేవరవు గదరా
అలవాటు లేదు మాకు నంతటనే చాలును

(॥తెలిసి॥)
పై కొనేవు తమకించి బత్తి నాపై నెంత లేదు
యేకడకో పోఁ దలఁచి యింతే కాకా
కోక గప్పేవు నా మీదఁ కూరిమి గలట్లానే
చేకొని నన్ను నిద్రవుచ్చెకొరకే కాదా

(॥తెలిసి॥)
యిదె వీడె మిచ్చేవు యేవి ననకుండా నన్ను
మదన మెత్తించేటి మందదిగాదా
యెదురుగా సొమ్ములు వెట్టే వీవిగలవానివలె
మొదల నాపైఁ బెద్ద మోపు గట్టఁ గాదా

(॥తెలిసి॥)
కౌఁగిట బిగించేవు కద్దులే నీ పగ నీఁగి
ఆగి వేరొకతెఁ బెండ్లి యాడనే కాకా
వీఁగక శ్రీవేంకటేశ వేడుకఁ గూడితి నన్ను
రాగి నా కోపముడిపి రక్షించనే కాదా

(||pallavi||)
tĕlisidimi nīsuddi devaravu gadarā
alavāḍu ledu māgu naṁtaḍane sālunu

(||tĕlisi||)
pai kŏnevu tamagiṁchi batti nābai nĕṁta ledu
yegaḍago pom̐ dalam̐si yiṁte kāgā
koga gappevu nā mīdam̐ kūrimi galaṭlāne
segŏni nannu nidravuchchĕgŏrage kādā

(||tĕlisi||)
yidĕ vīḍĕ michchevu yevi nanaguṁḍā nannu
madana mĕttiṁcheḍi maṁdadigādā
yĕdurugā sŏmmulu vĕṭṭe vīvigalavānivalĕ
mŏdala nābaim̐ bĕdda mobu gaṭṭam̐ gādā

(||tĕlisi||)
kaum̐giḍa bigiṁchevu kaddule nī paga nīm̐gi
āgi verŏgadĕm̐ bĕṁḍli yāḍane kāgā
vīm̐gaga śhrīveṁkaḍeśha veḍugam̐ gūḍidi nannu
rāgi nā kobamuḍibi rakṣhiṁchane kādā