Telisidi nee gunaalu tedadellamigaanu

తెలిసితి నీ గుణాలు తేటతెల్లమిగాను
Language

(॥పల్లవి॥)
తెలిసితి నీ గుణాలు తేటతెల్లమిగాను
చెలరేఁగి నాకేల చెప్పేవు నీవు

(॥తెలి॥)
తలవంపులే చెప్పీ దగ నీసుద్దులెల్లా
పలికేయానతి చెప్పీ బలునిందలు
లలి మైకాఁకలె చెప్పీ లాగుల నీ విరహము
పలుమారు నన్నే లొడఁబరచేవు నీవు

(॥తెలి॥)
సెలవినవ్వులే చెప్పీ చిత్తములో యానందము
పులక జొంపాలే చెప్పీ బొందులెల్లాను
యెలమి శ్రీవేంకటేశ యిటు నిన్ను నేలితివి
సొలపులేఁటికి తోడుచూపేవు నీవు

(||pallavi||)
tĕlisidi nī guṇālu teḍadĕllamigānu
sĕlarem̐gi nāgela sĕppevu nīvu

(||tĕli||)
talavaṁpule sĕppī daga nīsuddulĕllā
paligeyānadi sĕppī baluniṁdalu
lali maigām̐kalĕ sĕppī lāgula nī virahamu
palumāru nanne lŏḍam̐barasevu nīvu

(||tĕli||)
sĕlavinavvule sĕppī sittamulo yānaṁdamu
pulaga jŏṁpāle sĕppī bŏṁdulĕllānu
yĕlami śhrīveṁkaḍeśha yiḍu ninnu nelidivi
sŏlabulem̐ṭigi toḍusūbevu nīvu