తెలిసితి నల్లనాఁడే తేటతెల్లమిగాను
(॥పల్లవి॥)
తెలిసితి నల్లనాఁడే తేటతెల్లమిగాను
వెలసిన నీ గుణాలు వింతలుగాఁ జూచేనా
(॥తెలి॥)
యెన్నిలేవు నీ సుద్దులు యిసుక పాఁతరలు
పున్నమ వెన్నెల పొళ్ళు బూమి మీఁదను
నన్ను నెంత చోదించేవు నమ్మితి నప్పుడే నేను
అన్నిటా నీ సరసాల కౌఁ గాదనేనా
(॥తెలి॥)
పట్టరావు నీ చేఁతులు బయలువందిరులు
దట్టపు జడివానలు తలఁచరావు
గట్టిగా నేమి చూపేవు కంటి నప్పుడే నేను
యిట్టె నీ వింటికి రాఁగా నియ్యకొనకుండేనా
(॥తెలి॥)
తావుకొన్న నీ రతులు తంగేటి జున్నులు
కావేటి కాలువలు కలకాలము
యీవేళ శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
నీవే నన్ను నేలితివి నే నిఁక మఱచేనా
(||pallavi||)
tĕlisidi nallanām̐ḍe teḍadĕllamigānu
vĕlasina nī guṇālu viṁtalugām̐ jūsenā
(||tĕli||)
yĕnnilevu nī suddulu yisuga pām̐taralu
punnama vĕnnĕla pŏḽḽu būmi mīm̐danu
nannu nĕṁta sodiṁchevu nammidi nappuḍe nenu
anniḍā nī sarasāla kaum̐ gādanenā
(||tĕli||)
paṭṭarāvu nī sem̐tulu bayaluvaṁdirulu
daṭṭabu jaḍivānalu talam̐sarāvu
gaṭṭigā nemi sūbevu kaṁṭi nappuḍe nenu
yiṭṭĕ nī viṁṭigi rām̐gā niyyagŏnaguṁḍenā
(||tĕli||)
tāvugŏnna nī radulu taṁgeḍi junnulu
kāveḍi kāluvalu kalagālamu
yīveḽa śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
nīve nannu nelidivi ne nim̐ka maṟasenā