తెలిసితి మింక నెంత తేలించేవే
(॥పల్లవి॥)
తెలిసితి మింక నెంత తేలించేవే
కలికివి పతి నెంత కారించేవే
(॥తెలిసితి॥)
తరితీపులే కావా తమకము వెంచేవీని
శిరసుమొక్కులే కావా చిమ్మి రేఁచేవి
సరసములే కావా చవులు వుట్టించేవీని
తెరలో చూపులే కావా తెమలించేవి
(॥తెలిసితి॥)
మంచి మాటలే కావా మక్కువలు వుట్టించేవి
పొంచిన సిగ్గులే కావా పొడి సేసేవి
మించుమురిపేలే కావా మిగులఁ జొక్కించేవి
కొంచని బీరాలే కావా గుట్టు సేసేవి
(॥తెలిసితి॥)
తనువుసోఁకులే కావా తగులమి సేసేవి
ననుపురతులే కావా నమ్మించేవి
యెరసి శ్రీవేంకటేశుఁ డిదె ని న్నలమేల్మంగ
నినువు నీటులే కావా నెయ్యము సేసేవి
(||pallavi||)
tĕlisidi miṁka nĕṁta teliṁcheve
kaligivi padi nĕṁta kāriṁcheve
(||tĕlisidi||)
taridībule kāvā tamagamu vĕṁchevīni
śhirasumŏkkule kāvā simmi rem̐sevi
sarasamule kāvā savulu vuṭṭiṁchevīni
tĕralo sūbule kāvā tĕmaliṁchevi
(||tĕlisidi||)
maṁchi māḍale kāvā makkuvalu vuṭṭiṁchevi
pŏṁchina siggule kāvā pŏḍi sesevi
miṁchumuribele kāvā migulam̐ jŏkkiṁchevi
kŏṁchani bīrāle kāvā guṭṭu sesevi
(||tĕlisidi||)
tanuvusom̐kule kāvā tagulami sesevi
nanuburadule kāvā nammiṁchevi
yĕrasi śhrīveṁkaḍeśhum̐ ḍidĕ ni nnalamelmaṁga
ninuvu nīḍule kāvā nĕyyamu sesevi