తెలిసితే నీయందే తేటతెల్లమౌ నిది
(॥పల్లవి॥)
తెలిసితే నీయందే తేటతెల్లమౌ నిది
అలమేలుమంగ నీయందే కనుకొనవే
(॥తెలి॥)
యెంచరాదు పంచరాదు యెన్నిగలవే చుక్కలు
ముంచితేఁ జేటలకొద్ది ముత్తియములు
పెంచక పెరగె నవె పెనుఁజీఁకటి తీగెలు
అంచె నీ యారచి కత కారునెల్లు గళువు
(॥తెలి॥)
అనరాదు వినరాదు అగ్గువాయఁ దెమ్మెరలు
కనకపుఁ గొండ లెక్కెఁగదె చంద్రుఁడు
మొనసి మరుని బాణముల గెంజాయలు రేఁగె
యెనసిన యీ మారచి కేడాది గళువు
(॥తెలి॥)
కుచ్చరాదు తచ్చరాదు గుంపులాయను నవల
పచ్చిదేరెఁ గదవే పాయమెల్లాను
యిచ్చట శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
యిచ్చల నీ యారచికి నెన్నాళ్ల్తెనా గళువు
(||pallavi||)
tĕliside nīyaṁde teḍadĕllamau nidi
alamelumaṁga nīyaṁde kanugŏnave
(||tĕli||)
yĕṁcharādu paṁcharādu yĕnnigalave sukkalu
muṁchidem̐ jeḍalagŏddi muttiyamulu
pĕṁchaga pĕragĕ navĕ pĕnum̐jīm̐kaḍi tīgĕlu
aṁchĕ nī yārasi kada kārunĕllu gaḽuvu
(||tĕli||)
anarādu vinarādu agguvāyam̐ dĕmmĕralu
kanagabum̐ gŏṁḍa lĕkkĕm̐gadĕ saṁdrum̐ḍu
mŏnasi maruni bāṇamula gĕṁjāyalu rem̐gĕ
yĕnasina yī mārasi keḍādi gaḽuvu
(||tĕli||)
kuchcharādu tachcharādu guṁpulāyanu navala
pachchiderĕm̐ gadave pāyamĕllānu
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
yichchala nī yārasigi nĕnnāḽldĕnā gaḽuvu