తెలిసి చూచినవేళ దేవుఁ డొక్కఁడే నిలిచి
(॥పల్లవి॥)
తెలిసి చూచినవేళ దేవుఁ డొక్కఁడే నిలిచి
నలువంక రక్షించఁగ నవ్వీ నీ జీవుఁడు
(॥తెలిసి॥)
నెలవై తండ్రితొడపై నిద్రవోయేటి బాలుఁడు
కలలోనఁ బులిఁ గని కడు మొఱవెట్టినట్టు
లలరి హరి యాధారమై యుండఁగ మాయఁ జిక్కి
బలుసంసారబాధను భ్రమసీని జీవుఁడు
(॥తెలిసి॥)
తటుకున రాజుఁగొల్చి దండనుండే మనుజుఁడు
ఆట యింద్రజాలము చూచి యంబుధి యీఁదినట్టు
ఘటన హరి తనకు కర్తయై యుండఁగాను
కుటిలపుట జ్ఞానానఁ గుందీని జీవుఁడు
(॥తెలిసి॥)
దరిద్రుఁడైనవాఁడు తక్కక కన్నులు మూసి
నిరుపమాంజనముచే నిధానము గన్నయట్టు
యిరవై శ్రీవేంకటేశుఁ డిట్టే కరుణించఁగాను
యెరవులేని భక్తిచే నీడేరీ జీవుఁడు
(||pallavi||)
tĕlisi sūsinaveḽa devum̐ ḍŏkkam̐ḍe nilisi
naluvaṁka rakṣhiṁcham̐ga navvī nī jīvum̐ḍu
(||tĕlisi||)
nĕlavai taṁḍridŏḍabai nidravoyeḍi bālum̐ḍu
kalalonam̐ bulim̐ gani kaḍu mŏṟavĕṭṭinaṭṭu
lalari hari yādhāramai yuṁḍam̐ga māyam̐ jikki
balusaṁsārabādhanu bhramasīni jīvum̐ḍu
(||tĕlisi||)
taḍuguna rājum̐gŏlsi daṁḍanuṁḍe manujum̐ḍu
āḍa yiṁdrajālamu sūsi yaṁbudhi yīm̐dinaṭṭu
ghaḍana hari tanagu kardayai yuṁḍam̐gānu
kuḍilabuḍa jñānānam̐ guṁdīni jīvum̐ḍu
(||tĕlisi||)
daridrum̐ḍainavām̐ḍu takkaga kannulu mūsi
nirubamāṁjanamuse nidhānamu gannayaṭṭu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭe karuṇiṁcham̐gānu
yĕravuleni bhaktise nīḍerī jīvum̐ḍu