Telisi badugaro dehoolaala

తెలిసి బదుకరో దేహూలాల
Language

(॥పల్లవి॥)
తెలిసి బదుకరో దేహూలాల
వలెనని తలఁచినవారివాఁడే దేవుఁడు

(॥తెలిసి॥)
తనుఁ గొలువకూడితే తారము వెట్టఁ డేలిక
పెనఁగి కొలువకున్నఁ బెట్టు దేవుఁడు
జునుగుచు విడుతురు చుట్టాలు దరిద్రులైతే
వెనువెంటా నెంతయినా విడువఁడు దేవుఁడూ

(॥తెలిసి॥)
అంతట ముదిసితేను అంగనలు రోతురు
అంతరాత్మ యెన్నఁడు రోయఁడు దేవుఁడు
వింతగా నన్నఁ దమ్ములు విసాన కలుగుదురు
పొంతనే తా నలుగుఁడు పుట్టించిన దేవుఁడు

(॥తెలిసి॥)
వొదిగి మూల నుండితే వూరివారు మఱతురు
వదల కెందున్నా మఱవఁడు దేవుఁడు
తుదిముట్ట రక్షించు దుఃఖము లెల్ల నణఁచు
యెదుట శ్రీవేంకటేశుఁ డితఁడె పోదేవుఁడు

(||pallavi||)
tĕlisi badugaro dehūlāla
valĕnani talam̐sinavārivām̐ḍe devum̐ḍu

(||tĕlisi||)
tanum̐ gŏluvagūḍide tāramu vĕṭṭam̐ ḍeliga
pĕnam̐gi kŏluvagunnam̐ bĕṭṭu devum̐ḍu
junugusu viḍuduru suṭṭālu daridrulaide
vĕnuvĕṁṭā nĕṁtayinā viḍuvam̐ḍu devum̐ḍū

(||tĕlisi||)
aṁtaḍa mudisidenu aṁganalu roduru
aṁtarātma yĕnnam̐ḍu royam̐ḍu devum̐ḍu
viṁtagā nannam̐ dammulu visāna kaluguduru
pŏṁtane tā nalugum̐ḍu puṭṭiṁchina devum̐ḍu

(||tĕlisi||)
vŏdigi mūla nuṁḍide vūrivāru maṟaduru
vadala kĕṁdunnā maṟavam̐ḍu devum̐ḍu
tudimuṭṭa rakṣhiṁchu duḥkhamu lĕlla naṇam̐su
yĕduḍa śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍĕ podevum̐ḍu