Telisem gaa neegunamu tedamgaa meemdadigainaa

తెలిసెఁ గా నీగుణము తేటఁగా మీఁదటికైనా
Language

(॥పల్లవి॥)
తెలిసెఁ గా నీగుణము తేటఁగా మీఁదటికైనా
బలురాజసాలు చూపే పంతము లెఱఁగరా

(॥తెలి॥)
వొంటి నేను వేగించగా నూరకే యల్లాడ నీకు
కంటికి నిద్దుర వచ్చెఁగా: చెల్లబో
నంటున నాతో నీవు నవ్వే వనుచు నే-
నుంటిఁగాని యిట్టవుత నొకటీ నెఱఁగరా

(॥తెలి॥)
వెలసి నేఁ బానుపుపై విరహనఁ బొరలఁగా
కొలువు సేయించుకో గోరికాయఁగా
పిలిపించే విటు నాకే వలతు వనుంటిగాని
వొలిసీనొల్లములౌత వొకటీ నెఱఁగరా

(॥తెలి॥)
అద్దరిపాటుండగాను అంతలో విచ్చేసి కూడి
సుద్దులు చెప్పవచ్చేవు సుగుడవౌదు
ముద్దుల శ్రీవేంకటేశ మొరఁగే వనుంటిఁగాని
వొద్దికైతి వింతకతొ ల్లొకటీ నెఱఁగరా

(||pallavi||)
tĕlisĕm̐ gā nīguṇamu teḍam̐gā mīm̐daḍigainā
balurājasālu sūbe paṁtamu lĕṟam̐garā

(||tĕli||)
vŏṁṭi nenu vegiṁchagā nūrage yallāḍa nīgu
kaṁṭigi niddura vachchĕm̐gā: sĕllabo
naṁṭuna nādo nīvu navve vanusu ne-
nuṁṭim̐gāni yiṭṭavuda nŏgaḍī nĕṟam̐garā

(||tĕli||)
vĕlasi nem̐ bānububai virahanam̐ bŏralam̐gā
kŏluvu seyiṁchugo gorigāyam̐gā
pilibiṁche viḍu nāge valadu vanuṁṭigāni
vŏlisīnŏllamulauda vŏgaḍī nĕṟam̐garā

(||tĕli||)
addaribāḍuṁḍagānu aṁtalo vichchesi kūḍi
suddulu sĕppavachchevu suguḍavaudu
muddula śhrīveṁkaḍeśha mŏram̐ge vanuṁṭim̐gāni
vŏddigaidi viṁtagadŏ llŏgaḍī nĕṟam̐garā