Telibimchugo neeve dikkulamaamtaa

తెలిపించుకో నీవె దిక్కులమాఁటా
Language

(॥పల్లవి॥)
తెలిపించుకో నీవె దిక్కులమాఁటా
పలుకకు మాతో నీవు పైపై మాఁటా

(॥తెలి॥)
చెంగలిచూపులవొకచెలి నిన్నుఁజూచెనట
అంగడివీది రాఁగా నీ కదొకవఁటా
ముంగిటినుండి యొకతె ముంచి నీతో నవ్వెనట
యింతాగిన మోఁచె నీపై నిదొకమాఁటా

(॥తెలి॥)
మగువ యొకతె నిన్ను మాఁటా మోవ నాడె నట
అగడు సేసేరు నిన్ను నదొకమాఁటా
తగిలి యెకతె నీకుఁ దమ్ముల మొసఁగె నట
యెగసక్కెము లాయ నిదొకమాఁటా

(॥తెలి॥)
గక్కన నొకతె నిన్నుఁగాఁగిలించుకొనెనట
అక్కడనే మెచ్చేరు నిన్నదొకమాఁటా
యిక్కడ శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
యెక్కువల కెక్కుడాయ నిదొకమాఁటా

(||pallavi||)
tĕlibiṁchugo nīvĕ dikkulamām̐ṭā
palugagu mādo nīvu paibai mām̐ṭā

(||tĕli||)
sĕṁgalisūbulavŏgasĕli ninnum̐jūsĕnaḍa
aṁgaḍivīdi rām̐gā nī kadŏgavam̐ṭā
muṁgiḍinuṁḍi yŏgadĕ muṁchi nīdo navvĕnaḍa
yiṁtāgina mom̐sĕ nībai nidŏgamām̐ṭā

(||tĕli||)
maguva yŏgadĕ ninnu mām̐ṭā mova nāḍĕ naḍa
agaḍu seseru ninnu nadŏgamām̐ṭā
tagili yĕgadĕ nīgum̐ dammula mŏsam̐gĕ naḍa
yĕgasakkĕmu lāya nidŏgamām̐ṭā

(||tĕli||)
gakkana nŏgadĕ ninnum̐gām̐giliṁchugŏnĕnaḍa
akkaḍane mĕchcheru ninnadŏgamām̐ṭā
yikkaḍa śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
yĕkkuvala kĕkkuḍāya nidŏgamām̐ṭā