తెలిపించుకొ మ్మనవే దేశము వారిచేతనే
(॥పల్లవి॥)
తెలిపించుకొ మ్మనవే దేశము వారిచేతనే
కులికి సారెకు నా కొంగేల పట్టీనె
(॥తెలిపించు॥)
వాడలలో తననింద వడిఁ దేర్చుకొనుఁ గాక
యీడ నన్ను నొట్టు వెట్ట నెంతవాఁడే
ఆడితిఁ బో వెరపా అందరు నాడెటిమాఁట
చూడవె తనకు నింత సులభమా నేను
(॥తెలిపించు॥)
సారెకు దేవుళ్ల వొద్ద సత్యము నెరపుఁ గాక
వూర కైనా నన్ను ముట్టీ నుండఁ బట్టదా
తారుకాణించెఁ బోవె తగిలితే నిందరిని
వోరుచుకుండితే నూరకుండఁడు గా తాను
(॥తెలిపించు॥)
తనయింటిలోనఁ దానె తగవులు వెట్టుఁ గాక
విను నా తోవ వచ్చితే వెఱ్ఱివాఁడే
అనఁగానె శ్రీవెంకటాధిపుఁడు ననుఁ గూడె
మన సొక్క టాయ నేఁడు మరఁ గేలె యికను
(||pallavi||)
tĕlibiṁchugŏ mmanave deśhamu vārisedane
kuligi sārĕgu nā kŏṁgela paṭṭīnĕ
(||tĕlibiṁchu||)
vāḍalalo tananiṁda vaḍim̐ dersugŏnum̐ gāga
yīḍa nannu nŏṭṭu vĕṭṭa nĕṁtavām̐ḍe
āḍidim̐ bo vĕrabā aṁdaru nāḍĕḍimām̐ṭa
sūḍavĕ tanagu niṁta sulabhamā nenu
(||tĕlibiṁchu||)
sārĕgu devuḽla vŏdda satyamu nĕrabum̐ gāga
vūra kainā nannu muṭṭī nuṁḍam̐ baṭṭadā
tārugāṇiṁchĕm̐ bovĕ tagilide niṁdarini
vorusuguṁḍide nūraguṁḍam̐ḍu gā tānu
(||tĕlibiṁchu||)
tanayiṁṭilonam̐ dānĕ tagavulu vĕṭṭum̐ gāga
vinu nā tova vachchide vĕṭrivām̐ḍe
anam̐gānĕ śhrīvĕṁkaḍādhibum̐ḍu nanum̐ gūḍĕ
mana sŏkka ṭāya nem̐ḍu maram̐ gelĕ yiganu