తెలిపి చెప్పరే బుద్ది తెరవలాల పతికి
(॥పల్లవి॥)
తెలిపి చెప్పరే బుద్ది తెరవలాల పతికి
కలయఁగవలెఁ గాక కాఁగిట నీ సతిని
(॥తేలి॥)
కోవిలలు గుయ్యఁజోచ్చెగుదిగొనెఁ జిగురాకు
భావజుఁడు బాణములఁ బదనువెట్టె
సేవసేసీ జవరాలు చెంగటనుండి తనకు
యీవలెఁ గాక చనవు లేమనఁగవచ్చునే
(॥తేలి॥)
చిలుకలు మాటలాడెఁ జిమ్మిరేఁగెఁ దుమ్మిదలు
అలరి చంద్రోదయమాయ నిపుడు
సొలసి తనమొగము చూచి మాటలాడీఁ జెలి
బలిమి గూడుటగాక పాయ నెట్టువచ్చునే
(॥తేలి॥)
వాకుచ్చెఁ బావురములు వసంతుఁడు పొడచూపె
జోకలుగా చల్లగాలి సొంపు మెరసె
ఆకె యలమేల్‌మంగ తానైతే శ్రీవేంకటేశుఁడు
తూకొని యేలెఁగాక తోయ నెట్టువచ్చునే
(||pallavi||)
tĕlibi sĕppare buddi tĕravalāla padigi
kalayam̐gavalĕm̐ gāga kām̐giḍa nī sadini
(||teli||)
kovilalu guyyam̐jochchĕgudigŏnĕm̐ jigurāgu
bhāvajum̐ḍu bāṇamulam̐ badanuvĕṭṭĕ
sevasesī javarālu sĕṁgaḍanuṁḍi tanagu
yīvalĕm̐ gāga sanavu lemanam̐gavachchune
(||teli||)
silugalu māḍalāḍĕm̐ jimmirem̐gĕm̐ dummidalu
alari saṁdrodayamāya nibuḍu
sŏlasi tanamŏgamu sūsi māḍalāḍīm̐ jĕli
balimi gūḍuḍagāga pāya nĕṭṭuvachchune
(||teli||)
vāguchchĕm̐ bāvuramulu vasaṁtum̐ḍu pŏḍasūbĕ
jogalugā sallagāli sŏṁpu mĕrasĕ
āgĕ yalamelmaṁga tānaide śhrīveṁkaḍeśhum̐ḍu
tūgŏni yelĕm̐gāga toya nĕṭṭuvachchune