Telibi seppamgavale tellamigaa mumdumumde

తెలిపి చెప్పఁగవలె తెల్లమిగా ముందుముందే
Language

(॥పల్లవి॥)
తెలిపి చెప్పఁగవలె తెల్లమిగా ముందుముందే
వలపించి నన్ను నింత వలలఁ బెట్టేవు

(॥॥)
మొలకలచన్నుల మొనలు దాఁకీఁజమ్మీ
చెలరేఁగి పయ్యదపైఁ జేయివేసేవు
కలువకనులచూపులు కడువాండ్లుసుమీ
నెలవై నాయెదుటనే నిలిచివున్నాఁడవు

(॥॥)
మంచి గాలపుమాటలు మతిఁదగిలించీఁ జమ్మీ
అంచేలనే నన్ను సుద్దు లడిగేవు
కొంచక నాకొనవేలిగోరు జీరవారీఁ జుమ్మీ
ముంచి నీపాదాలకు మొక్కించుకొనేవు

(॥॥)
చీఁకటికొప్పు నెరులు చేరి నిన్నుఁగప్పీఁజుమ్మీ
తాఁకించినచేతుల ముందులవట్టేవు
యేఁకటతో శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
తూఁకువసుమ్మీ పిఱుఁదు తొడ లెక్కుమనేవు

(||pallavi||)
tĕlibi sĕppam̐gavalĕ tĕllamigā muṁdumuṁde
valabiṁchi nannu niṁta valalam̐ bĕṭṭevu

(||||)
mŏlagalasannula mŏnalu dām̐kīm̐jammī
sĕlarem̐gi payyadabaim̐ jeyivesevu
kaluvaganulasūbulu kaḍuvāṁḍlusumī
nĕlavai nāyĕduḍane nilisivunnām̐ḍavu

(||||)
maṁchi gālabumāḍalu madim̐dagiliṁchīm̐ jammī
aṁchelane nannu suddu laḍigevu
kŏṁchaga nāgŏnaveligoru jīravārīm̐ jummī
muṁchi nībādālagu mŏkkiṁchugŏnevu

(||||)
sīm̐kaḍigŏppu nĕrulu seri ninnum̐gappīm̐jummī
tām̐kiṁchinasedula muṁdulavaṭṭevu
yem̐kaḍado śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
tūm̐kuvasummī piṟum̐du tŏḍa lĕkkumanevu