Tegaraanisodigi deemasambule melu

తెగరానిచోటికి దీమసంబులే మేలు
Language

(॥పల్లవి॥)
తెగరానిచోటికి దీమసంబులే మేలు
మొగమొగము చూచితే ముందువెనకౌను

(॥తెగ॥)
తప్పక చూచుటకంటె తల వంచుకొంట మేలు
యిప్పటి యలుకలు మీఁద నిట్లుండునా
ఉప్పటించి దూరుకంటె నూరకుండుట మేలు
నెప్పునఁ గలసినమీఁద నేరంబు లౌను

(॥తెగ॥)
దగ్గరి గొణఁగుటకంటెఁ దలఁగి పోవుట మేలు
కగ్గుదేరీ నప్పటికి కడమ లౌను
వెగ్గలించి తెగుకంటె వెడఁగు దైన్యమే మేలు
అగ్గపుఁ బంతపువేళ నటు బొంక బరవు

(॥తెగ॥)
మంకుఁదనములకంటె మంచితనమే మేలు
వంక లొత్తేటివేళ వాండ్లౌను
అంకెలనే శ్రీవేంకటాద్రీశుఁ గూడితివి
పొంకమగు చెలియ తలపోఁత లపు డౌను

(||pallavi||)
tĕgarānisoḍigi dīmasaṁbule melu
mŏgamŏgamu sūside muṁduvĕnagaunu

(||tĕga||)
tappaga sūsuḍagaṁṭĕ tala vaṁchugŏṁṭa melu
yippaḍi yalugalu mīm̐da niṭluṁḍunā
uppaḍiṁchi dūrugaṁṭĕ nūraguṁḍuḍa melu
nĕppunam̐ galasinamīm̐da neraṁbu launu

(||tĕga||)
daggari gŏṇam̐guḍagaṁṭĕm̐ dalam̐gi povuḍa melu
kagguderī nappaḍigi kaḍama launu
vĕggaliṁchi tĕgugaṁṭĕ vĕḍam̐gu dainyame melu
aggabum̐ baṁtabuveḽa naḍu bŏṁka baravu

(||tĕga||)
maṁkum̐danamulagaṁṭĕ maṁchidaname melu
vaṁka lŏtteḍiveḽa vāṁḍlaunu
aṁkĕlane śhrīveṁkaḍādrīśhum̐ gūḍidivi
pŏṁkamagu sĕliya talabom̐ta labu ḍaunu