తీరుచవయ్య తగవు దీనికి నీవు
(॥పల్లవి॥)
తీరుచవయ్య తగవు దీనికి నీవు
నేరుపరితనమెల్లా నీచేత నున్నది
(॥తీరు॥)
పందేలువేసి నీతోఁ బలుమారు జూజమాడి
దిందుపడ నుంగరము దీసుకొన్నది
అందుకుఁగా వేరొకతె అది దనసొమ్మనుచు
అంది తలపిడివట్టి అడుగుతానున్నది
(॥తీరు॥)
సరి బేసి వట్టి యొక్కసతి నిన్ను నోడించి
గొరబుగా నచ్చుటాసె కోకకొంగున
సిరుల నీదట్టి తనచీరంటా వేరొకతె
అరసి పట్టి యందుకు నాపె మారుకొనెను
(॥తీరు॥)
వానగుంటలాడి వొకవనిత నీచేయి వట్టి
ఆనవెట్టి వేలొకతె ఆచేయిఁ బట్టె
ఆనుక శ్రీవేంకటేశ అలమేల్ మంగ నే వచ్చి
మేనంతి వురమెక్కితే మెచ్చిరి యిందరును
(||pallavi||)
tīrusavayya tagavu dīnigi nīvu
nerubaridanamĕllā nīseda nunnadi
(||tīru||)
paṁdeluvesi nīdom̐ balumāru jūjamāḍi
diṁdubaḍa nuṁgaramu dīsugŏnnadi
aṁdugum̐gā verŏgadĕ adi danasŏmmanusu
aṁdi talabiḍivaṭṭi aḍugudānunnadi
(||tīru||)
sari besi vaṭṭi yŏkkasadi ninnu noḍiṁchi
gŏrabugā nachchuḍāsĕ kogagŏṁguna
sirula nīdaṭṭi tanasīraṁṭā verŏgadĕ
arasi paṭṭi yaṁdugu nābĕ mārugŏnĕnu
(||tīru||)
vānaguṁṭalāḍi vŏgavanida nīseyi vaṭṭi
ānavĕṭṭi velŏgadĕ āseyim̐ baṭṭĕ
ānuga śhrīveṁkaḍeśha alamel maṁga ne vachchi
menaṁti vuramĕkkide mĕchchiri yiṁdarunu