తీరె నీ యలుకలెల్లా తిరుమాళారు
(॥పల్లవి॥)
తీరె నీ యలుకలెల్లా తిరుమాళారు
తీరని మోహముతోడి తిరుమాళారు
(॥తీరె॥)
వీనుల పండువగా వేఁడుకొనీ నీవిభుఁడు
తేనెమోవి మాటాడవో తిరుమాళారు
పూనిపట్టి యప్పటిని పొద్దు గడపఁగ నేల
దీన నేమి వచ్చె నీకు తిరుమాళారు
(॥తీరె॥)
చక్కని నీచన్నులపైఁ జాఁచీ నాతఁడు చేయి
తక్కని నగవు లేలో తిరుమాళారు
మొక్కేవానివలెనే ముందర నిలుచున్నాఁడు, ఆ
దిక్కు చూడఁగదవమ్మ తిరుమాళారు
(॥తీరె॥)
కులికి శ్రీవేంకటాద్రి గోవిందరాజు నేప్రొద్దు
తిలకించి కూడె నట్టె తిరుమాళారు
పలుకుఁ బంతము చెల్లఁ బైపై మీ కిద్దరికి
తెలిసితిమి మీగుట్టు తిరుమాళారు
(||pallavi||)
tīrĕ nī yalugalĕllā tirumāḽāru
tīrani mohamudoḍi tirumāḽāru
(||tīrĕ||)
vīnula paṁḍuvagā vem̐ḍugŏnī nīvibhum̐ḍu
tenĕmovi māḍāḍavo tirumāḽāru
pūnibaṭṭi yappaḍini pŏddu gaḍabam̐ga nela
dīna nemi vachchĕ nīgu tirumāḽāru
(||tīrĕ||)
sakkani nīsannulabaim̐ jām̐sī nādam̐ḍu seyi
takkani nagavu lelo tirumāḽāru
mŏkkevānivalĕne muṁdara nilusunnām̐ḍu, ā
dikku sūḍam̐gadavamma tirumāḽāru
(||tīrĕ||)
kuligi śhrīveṁkaḍādri goviṁdarāju neprŏddu
tilagiṁchi kūḍĕ naṭṭĕ tirumāḽāru
palugum̐ baṁtamu sĕllam̐ baibai mī kiddarigi
tĕlisidimi mīguṭṭu tirumāḽāru