తీపులోఁ గారము లేల తెలుపరే విభునికి
(॥పల్లవి॥)
తీపులోఁ గారము లేల తెలుపరే విభునికి
యేపునఁ జనవు లిచ్చి యేలుకొనుఁ గాకా
(॥॥)
కప్పురాన వేసేవాఁ డు కాఁక లేల రేఁచీనే
దప్పి దేర మోవి యిచ్చి తనుపుఁగాక
చప్పుడుగా నవ్వేవాఁడు జాగ లేల సేసీనే
చిప్పిలఁ గౌఁగిట నించి చెలఁగించుఁ గాకా
(॥॥)
సేసలు చల్లే వాఁడు సిగ్గు లేల పుట్టించీనే
ఆస దీర రతుల నోలార్చుఁ గాక
దాసితోఁ బెండ్లాడేవాఁడు వట్టి తరితీపు లేల
మూసిన ముత్తెమైనా మోము చూచుఁగాక
(॥॥)
గందము పూసినవాఁడు కడు నెలయించ నేలే
అంది నా గుబ్బల నుర మంటించుఁ గాక
యిందె శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
పొందె నిఁకఁ బంతా లేలే భోగించుఁ గాక
(||pallavi||)
tībulom̐ gāramu lela tĕlubare vibhunigi
yebunam̐ janavu lichchi yelugŏnum̐ gāgā
(||||)
kappurāna vesevām̐ ḍu kām̐ka lela rem̐sīne
dappi dera movi yichchi tanubum̐gāga
sappuḍugā navvevām̐ḍu jāga lela sesīne
sippilam̐ gaum̐giḍa niṁchi sĕlam̐giṁchum̐ gāgā
(||||)
sesalu salle vām̐ḍu siggu lela puṭṭiṁchīne
āsa dīra radula nolārsum̐ gāga
dāsidom̐ bĕṁḍlāḍevām̐ḍu vaṭṭi taridību lela
mūsina muttĕmainā momu sūsum̐gāga
(||||)
gaṁdamu pūsinavām̐ḍu kaḍu nĕlayiṁcha nele
aṁdi nā gubbala nura maṁṭiṁchum̐ gāga
yiṁdĕ śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
pŏṁdĕ nim̐kam̐ baṁtā lele bhogiṁchum̐ gāga