Tedadellamulu telisinavi

తేటతెల్లములు తెలిసినవి
Language

(॥పల్లవి॥)
తేటతెల్లములు తెలిసినవి
యేఁటికి మఱఁగులు యిదివో మాట

(॥॥)
ననుపుగలిగితేనే నవ్వులు
మనసువచ్చితేనే మంతనాలు
తనవారితనమైతే తగవులు
యెనలేని రమణుఁడ ఇదివో మాట

(॥॥)
సమ్మతించితే సరసములు
నమ్మికలైతే నంటులు
పమ్మినవలపులె బలుములు
యిమ్ములఁ గనుఁగొంటే యిదివో మాట

(॥॥)
కైవసమైతే కడఁకలు
మోవులయీవులె ముదములు
శ్రీ వేంకటేశ్వర చెలఁగి నన్ను
యీవలఁ గూడితి విదివో మాట

(||pallavi||)
teḍadĕllamulu tĕlisinavi
yem̐ṭigi maṟam̐gulu yidivo māḍa

(||||)
nanubugaligidene navvulu
manasuvachchidene maṁtanālu
tanavāridanamaide tagavulu
yĕnaleni ramaṇum̐ḍa idivo māḍa

(||||)
sammadiṁchide sarasamulu
nammigalaide naṁṭulu
pamminavalabulĕ balumulu
yimmulam̐ ganum̐gŏṁṭe yidivo māḍa

(||||)
kaivasamaide kaḍam̐kalu
movulayīvulĕ mudamulu
śhrī veṁkaḍeśhvara sĕlam̐gi nannu
yīvalam̐ gūḍidi vidivo māḍa