తేటతెల్లమిగ నన్నీఁ దెలిసితిమి
(॥పల్లవి॥)
తేటతెల్లమిగ నన్నీఁ దెలిసితిమి
ఆఁటదాననంటా నన్ను నాఱడిఁ బెట్టేవు
(॥॥)
చెఁత నాపె నీకు నిట్టె సేవసేయఁగాఁ జూచి
యింత నీవు వేఁడుకొన్నా నితవయ్యీనా
యెంతలేదు నీవేసాలు యెఱఁగనా నేఁ దొల్లి
సంతకూటములు చూపి సటలఁబెట్టేవు
(॥॥)
సన్నల నాపె నీతో సరసాలాడఁగాఁ జూచి
మన్నన లెన్నిచ్నినాను మనసొగ్గీనా
పన్నిన నీమాయ లివి భావించి తెలియనా
తిన్నని మోవితేనెల తీపులఁబెట్టేవు
(॥॥)
గరిమెతో నాపె నీకాఁగిట నుండఁగాఁ జూచి
సరి నెంతలాలించినా చవు లయ్యీనా
యిరువై శ్రీవేంకటేశ యేలితివి నన్ను విట్టె
శిరసువంచి నవ్వి సేసలు వెట్టేవు
(||pallavi||)
teḍadĕllamiga nannīm̐ dĕlisidimi
ām̐ṭadānanaṁṭā nannu nāṟaḍim̐ bĕṭṭevu
(||||)
sĕm̐ta nābĕ nīgu niṭṭĕ sevaseyam̐gām̐ jūsi
yiṁta nīvu vem̐ḍugŏnnā nidavayyīnā
yĕṁtaledu nīvesālu yĕṟam̐ganā nem̐ dŏlli
saṁtagūḍamulu sūbi saḍalam̐bĕṭṭevu
(||||)
sannala nābĕ nīdo sarasālāḍam̐gām̐ jūsi
mannana lĕnnichninānu manasŏggīnā
pannina nīmāya livi bhāviṁchi tĕliyanā
tinnani movidenĕla tībulam̐bĕṭṭevu
(||||)
garimĕdo nābĕ nīgām̐giḍa nuṁḍam̐gām̐ jūsi
sari nĕṁtalāliṁchinā savu layyīnā
yiruvai śhrīveṁkaḍeśha yelidivi nannu viṭṭĕ
śhirasuvaṁchi navvi sesalu vĕṭṭevu