Tedadellamaaya tillagovimdumdaa

తేటతెల్లమాయ తిల్లగోవిందుఁడా
Language

(॥పల్లవి॥)
తేటతెల్లమాయ తిల్లగోవిందుఁడా
నీటు రాజసము నిండెను నీకు

(॥॥)
చేరి నిన్నొకతె చేయి వట్టుకొనె
కూరిములు సారెఁ గొసరెనొకతె
యేరితిఁ దనిపే విద్దరిని నీవు
ఆరీతి వలపులబ్బెను మీకు

(॥॥)
చిమ్ముచు నొకతె సిగ్గులువడెను
బొమ్మల జంకించెఁ బోరచి నొకతె
యెమ్మెలకిద్దరి నెట్టు లాలించేవు
దొమ్ముల యాసలు దొరకె మీకు

(॥॥)
కందువ నొకతె కాఁగిలించి కూడె
చెంది వేరొక్కతె సేసవెట్టి కూడె
యిందరు శ్రీవేంకటేశల మేల్మంగ
పొందులన్నిటాను పొసఁగె మీకు

(||pallavi||)
teḍadĕllamāya tillagoviṁdum̐ḍā
nīḍu rājasamu niṁḍĕnu nīgu

(||||)
seri ninnŏgadĕ seyi vaṭṭugŏnĕ
kūrimulu sārĕm̐ gŏsarĕnŏgadĕ
yeridim̐ danibe viddarini nīvu
ārīdi valabulabbĕnu mīgu

(||||)
simmusu nŏgadĕ sigguluvaḍĕnu
bŏmmala jaṁkiṁchĕm̐ borasi nŏgadĕ
yĕmmĕlagiddari nĕṭṭu lāliṁchevu
dŏmmula yāsalu dŏragĕ mīgu

(||||)
kaṁduva nŏgadĕ kām̐giliṁchi kūḍĕ
sĕṁdi verŏkkadĕ sesavĕṭṭi kūḍĕ
yiṁdaru śhrīveṁkaḍeśhala melmaṁga
pŏṁdulanniḍānu pŏsam̐gĕ mīgu