Tavvambode vatti joli tagu lemtige

తవ్వఁబోతే వట్టి జోలి తగు లేఁటికే
Language

(॥పల్లవి॥)
తవ్వఁబోతే వట్టి జోలి తగు లేఁటికే
వువ్విళ్లూర నేఁటికే వూరకున్న మేల

(॥తవ్వ॥)
మక్కువలేనిచోటి మాట లేమిటికే
చొక్కుచు నిద్దిరించిన సుకము గాక
కక్కసించి పిలిచేటి కలయి కేమిటికే
పుక్కట నెత్తమాడిన పొద్దు వోవుఁ గాక

(॥తవ్వ॥)
తెచ్చుకోలుఁదన మన్న తెలిసి నవ్వు లేఁటికే
గచ్చుఁ జిత్తరువు చచిన ఘనత గాకా
వచ్చీ రాని చప్పునయిన వల పది యేఁటికే
చెచ్చెర యేకతముల చింత మేలు గాకా

(॥తవ్వ॥)
కడుఁ బరాకై వుండే కౌఁగిలది యేమిటికే
విడిచి వొంటి నుండినా వేవేలు గాకా
చిడిముడి నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁ డిట్టె
యెడయఁగ నేమిటికే యియ్యకింటి గాకా

(||pallavi||)
tavvam̐bode vaṭṭi joli tagu lem̐ṭige
vuvviḽlūra nem̐ṭige vūragunna mela

(||tavva||)
makkuvalenisoḍi māḍa lemiḍige
sŏkkusu niddiriṁchina sugamu gāga
kakkasiṁchi piliseḍi kalayi kemiḍige
pukkaḍa nĕttamāḍina pŏddu vovum̐ gāga

(||tavva||)
tĕchchugolum̐dana manna tĕlisi navvu lem̐ṭige
gachchum̐ jittaruvu sasina ghanada gāgā
vachchī rāni sappunayina vala padi yem̐ṭige
sĕchchĕra yegadamula siṁta melu gāgā

(||tavva||)
kaḍum̐ barāgai vuṁḍe kaum̐giladi yemiḍige
viḍisi vŏṁṭi nuṁḍinā vevelu gāgā
siḍimuḍi nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ
yĕḍayam̐ga nemiḍige yiyyagiṁṭi gāgā