తత్తరపు నీలోని తాపము మానితేఁ జాలు
(॥పల్లవి॥)
తత్తరపు నీలోని తాపము మానితేఁ జాలు
యిత్తల మీఁదటి పను లెట్టయినాఁ గాని
(॥తత్తరపు॥)
పక్క నుండఁగానె నన్ను భ్రమసి పేరఁ బిలిచే
వెక్కడ పరా కైతి వేరా నీవు
తక్కక నీవు మోహించేదాని గుఱతు చెప్పరా
యిక్కడికిఁ దోడి తెచ్చే యె గ్గైనాఁ గాని
(॥తత్తరపు॥)
ఆకు మడి చియ్యఁగానె అవ్వలఁ జేయి చాఁచేవు
యేకడ వున్నది చిత్త మేరా నీవు
ఆకెతో నీకు నే మని ఆతుమ చెప్పవలసె
చేకొని నాతోఁ జెప్పర చెప్పి వచ్చేఁ గాని
(॥తత్తరపు॥)
నేమాన నేఁ గూడఁగాను నిలువెల్లఁ గరఁగితి
వే మాఁట దలఁచుకొంటి వేరా నీవు
యేమిర శ్రీవెంకటేశ యెవ్వతె జగడించెరా
కామించి యాన తీరా వొక్కటి సేసేఁ గాని
(||pallavi||)
tattarabu nīloni tābamu mānidem̐ jālu
yittala mīm̐daḍi panu lĕṭṭayinām̐ gāni
(||tattarabu||)
pakka nuṁḍam̐gānĕ nannu bhramasi peram̐ bilise
vĕkkaḍa parā kaidi verā nīvu
takkaga nīvu mohiṁchedāni guṟadu sĕpparā
yikkaḍigim̐ doḍi tĕchche yĕ ggainām̐ gāni
(||tattarabu||)
āgu maḍi siyyam̐gānĕ avvalam̐ jeyi sām̐sevu
yegaḍa vunnadi sitta merā nīvu
āgĕdo nīgu ne mani āduma sĕppavalasĕ
segŏni nādom̐ jĕppara sĕppi vachchem̐ gāni
(||tattarabu||)
nemāna nem̐ gūḍam̐gānu niluvĕllam̐ garam̐gidi
ve mām̐ṭa dalam̐sugŏṁṭi verā nīvu
yemira śhrīvĕṁkaḍeśha yĕvvadĕ jagaḍiṁchĕrā
kāmiṁchi yāna tīrā vŏkkaḍi sesem̐ gāni