తరుణులసహజాలు తలఁచుకోవోయి నీవు
(॥పల్లవి॥)
తరుణులసహజాలు తలఁచుకోవోయి నీవు
సరఁసుఁడవు బుద్దు లిచ్చట నేము చెప్పేమా
(॥॥)
ఆసలఁ బెట్టుదురు అట్టె లోనయినదాఁకా
వాసుల మీరుదురు వలచితేను
బేసబెల్లిచేఁతలఁ బెనఁగుదు రేడనైనా
బాసలు గొందురు తముఁ బాయకుండాను
(॥॥)
కాఁపురాలు సేతురు కాణాచయినదాఁ కా
తీపులఁ బెట్టుదురు దిక్కుచూచితే
మాపు రేపుఁ బైకొందురు మనసు నమ్మికలను
రాఁపుగా నవ్వుదురట్టె రతుల కొరకును
(॥॥)
పచ్చిగాఁ జెనకుదురు పరాకు మానినదాఁకా
తచ్చనలు సేతురు తగిలితేను
ఇచ్చట శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితివి
ఇచ్చకపునసతులు తా మెదురై కలతురు
(||pallavi||)
taruṇulasahajālu talam̐sugovoyi nīvu
saram̐sum̐ḍavu buddu lichchaḍa nemu sĕppemā
(||||)
āsalam̐ bĕṭṭuduru aṭṭĕ lonayinadām̐kā
vāsula mīruduru valasidenu
besabĕllisem̐talam̐ bĕnam̐gudu reḍanainā
bāsalu gŏṁduru tamum̐ bāyaguṁḍānu
(||||)
kām̐purālu seduru kāṇāsayinadām̐ kā
tībulam̐ bĕṭṭuduru dikkusūside
mābu rebum̐ baigŏṁduru manasu nammigalanu
rām̐pugā navvuduraṭṭĕ radula kŏragunu
(||||)
pachchigām̐ jĕnaguduru parāgu māninadām̐kā
tachchanalu seduru tagilidenu
ichchaḍa śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidivi
ichchagabunasadulu tā mĕdurai kaladuru