(॥పల్లవి॥)
తరుణులతోడనా నీ తరితీపులు
తొరలింపుఁ గూరిముల దొరపాటివాఁడవు
(॥॥)
వలచినసతితోను వాసికిఁ బెనఁగుదురా
పలుకులు నేరిచిన పంతగాఁడవు
బలిమిఁ జెనకఁగాను పరాకు సేయుదురా
నెలకొన్న జవ్వనపునెరవాదివాఁడవు
(॥॥)
ఆసగించివున్న యింతి నారఁడిఁ బెట్టుదురా
సేసవెట్టి పెండ్లాడిన చెలువుఁడవు
నీసరిఁ గూచుండఁగాను నీటులు చూపుదురా
వేసటలేనిరతుల వేడుకకాఁడవు
(॥॥)
అలమేలుమంగఁ గూడి అలయించి నవ్వుదురా
తెలివి శ్రీ వేంకటాద్రి దేవుఁడవు
కలసి మొక్కఁగా మోవికడుపిప్పి సేతురా
తలపోఁత లెఱిఁగిన దయగలవాఁడవు
(||pallavi||)
taruṇuladoḍanā nī taridībulu
tŏraliṁpum̐ gūrimula dŏrabāḍivām̐ḍavu
(||||)
valasinasadidonu vāsigim̐ bĕnam̐gudurā
palugulu nerisina paṁtagām̐ḍavu
balimim̐ jĕnagam̐gānu parāgu seyudurā
nĕlagŏnna javvanabunĕravādivām̐ḍavu
(||||)
āsagiṁchivunna yiṁti nāram̐ḍim̐ bĕṭṭudurā
sesavĕṭṭi pĕṁḍlāḍina sĕluvum̐ḍavu
nīsarim̐ gūsuṁḍam̐gānu nīḍulu sūbudurā
vesaḍaleniradula veḍugagām̐ḍavu
(||||)
alamelumaṁgam̐ gūḍi alayiṁchi navvudurā
tĕlivi śhrī veṁkaḍādri devum̐ḍavu
kalasi mŏkkam̐gā movigaḍubippi sedurā
talabom̐ta lĕṟim̐gina dayagalavām̐ḍavu