(॥పల్లవి॥)
తరుణివి నీకింత తగవుగాదు
గరిమల నింతటఁ గాఁగిలించఁగదవే
(॥తరుణి॥)
పలుకఁగదవే నీపతితోను
చలములేమిటికే సారెకును
పిలువఁగానే యేల బిగిసేవే
మొలకచన్నులనాఁడే మోహించె నతఁడు
(॥తరుణి॥)
వెస మోవి యియ్యవే విభునికి
కొసరులింకానేల కూడపెట్టేవే
వసమై యుండఁగనేల వనరేవే నీకు
పొసఁగి కన్నెనాఁడే పొందాయ నతఁడు
(॥తరుణి॥)
కనుఁగొనవే శ్రీవేంకటేశ్వరుని
మనసేమి చూచేవే మాఁటిమాఁటికి
వొనరికూడె నింకేల వొల వేసేవే నినుఁ
బెనఁగి చిన్ననాఁడే పెండ్లాడె నతఁడు
(||pallavi||)
taruṇivi nīgiṁta tagavugādu
garimala niṁtaḍam̐ gām̐giliṁcham̐gadave
(||taruṇi||)
palugam̐gadave nībadidonu
salamulemiḍige sārĕgunu
piluvam̐gāne yela bigiseve
mŏlagasannulanām̐ḍe mohiṁchĕ nadam̐ḍu
(||taruṇi||)
vĕsa movi yiyyave vibhunigi
kŏsaruliṁkānela kūḍabĕṭṭeve
vasamai yuṁḍam̐ganela vanareve nīgu
pŏsam̐gi kannĕnām̐ḍe pŏṁdāya nadam̐ḍu
(||taruṇi||)
kanum̐gŏnave śhrīveṁkaḍeśhvaruni
manasemi sūseve mām̐ṭimām̐ṭigi
vŏnarigūḍĕ niṁkela vŏla veseve ninum̐
bĕnam̐gi sinnanām̐ḍe pĕṁḍlāḍĕ nadam̐ḍu