తరుణిమొగము చూచి దయవుట్టె మాకెల్ల
(॥పల్లవి॥)
తరుణిమొగము చూచి దయవుట్టె మాకెల్ల
నిరతాన నవ్వుకొంటా నీ వద్దనే వున్నది
(॥తురుణి॥)
చుక్క వొడచినదాఁకా జూజాలే యాడితివి
వెక్కసపు రతులకు వేళ యేది
అక్కటా చెలియనింత అటమాటింతురా నీవు
నిక్కమంటా నాసపడి నీవద్దనే వున్నది
(॥తరుణి॥)
కోడి గూసినందాఁకా సాగుడుఁగతే చెప్పితివి
వీడెమిప్పించుకొనను వేళ యేది
పాడితోనే చెలినింత బ్రమయింతురా నీవు
నీడల నిన్ను నమ్మి నీవద్దనే వున్నది
(॥తరుణి॥)
బగ్గనఁ దెల్ల నౌదాఁకాఁ బరాకులే సేసితివి
వెగ్గళించి చొక్కుదేర వేళ యేది
తగ్గి శ్రీవేంకటేశ కాంతను మఱపించితివి
నిగ్గుల కాఁగిటఁగూడి నీవద్దనే వున్నది
(||pallavi||)
taruṇimŏgamu sūsi dayavuṭṭĕ māgĕlla
niradāna navvugŏṁṭā nī vaddane vunnadi
(||turuṇi||)
sukka vŏḍasinadām̐kā jūjāle yāḍidivi
vĕkkasabu radulagu veḽa yedi
akkaḍā sĕliyaniṁta aḍamāḍiṁturā nīvu
nikkamaṁṭā nāsabaḍi nīvaddane vunnadi
(||taruṇi||)
koḍi gūsinaṁdām̐kā sāguḍum̐gade sĕppidivi
vīḍĕmippiṁchugŏnanu veḽa yedi
pāḍidone sĕliniṁta bramayiṁturā nīvu
nīḍala ninnu nammi nīvaddane vunnadi
(||taruṇi||)
bagganam̐ dĕlla naudām̐kām̐ barāgule sesidivi
vĕggaḽiṁchi sŏkkudera veḽa yedi
taggi śhrīveṁkaḍeśha kāṁtanu maṟabiṁchidivi
niggula kām̐giḍam̐gūḍi nīvaddane vunnadi