Tarunim joosi naagu dayavuttenu

తరుణిఁ జూచి నాకు దయవుట్టెను
Language

(॥పల్లవి॥)
తరుణిఁ జూచి నాకు దయవుట్టెను
పరగ నెందాఁకా నెంత పరచితివయ్యా

(॥తరు॥)
నిలువునఁ బులకించె నిండాఁ జెమటగారె
చెలి నేమిసేసితివి చెప్పవయ్యా
అలకలెల్లాఁ జెదరె ఆయములు గరఁగెను
సొలసి నీ బలిమెంత చూపితివయ్యా

(॥తరు॥)
కన్నులకుఁ గెంపెక్కె కడు నిట్టూర్పులు రేఁగె
కన్నె నప్పు డేమంటివో కదవయ్యా
చెన్ను మీరె నలపులు సెలవుల సిగ్గుదేరె
మిన్నక నీ నేర్పు లెన్ని మెరయించితివయ్యా

(॥తరు॥)
పఱపుపైఁ బవళించె పచ్చిదేరె మేనెల్లా
గుఱిగా నీసతినెట్లు గూడితివయ్యా
నెఱయ శ్రీవేంకటేశ నిండె కళలు మోమున
జఱసి సరసమేమి జరపితివయ్యా

(||pallavi||)
taruṇim̐ jūsi nāgu dayavuṭṭĕnu
paraga nĕṁdām̐kā nĕṁta parasidivayyā

(||taru||)
niluvunam̐ bulagiṁchĕ niṁḍām̐ jĕmaḍagārĕ
sĕli nemisesidivi sĕppavayyā
alagalĕllām̐ jĕdarĕ āyamulu garam̐gĕnu
sŏlasi nī balimĕṁta sūbidivayyā

(||taru||)
kannulagum̐ gĕṁpĕkkĕ kaḍu niṭṭūrbulu rem̐gĕ
kannĕ nappu ḍemaṁṭivo kadavayyā
sĕnnu mīrĕ nalabulu sĕlavula sigguderĕ
minnaga nī nerbu lĕnni mĕrayiṁchidivayyā

(||taru||)
paṟabubaim̐ bavaḽiṁchĕ pachchiderĕ menĕllā
guṟigā nīsadinĕṭlu gūḍidivayyā
nĕṟaya śhrīveṁkaḍeśha niṁḍĕ kaḽalu momuna
jaṟasi sarasamemi jarabidivayyā