Tarunilo naa manasu taa neramgamdaa

తరుణిలో నా మనసు తా నెరఁగఁడా
Language

(॥పల్లవి॥)
తరుణిలో నా మనసు తా నెరఁగఁడా
తెరదీసి నే నింత తెలుపఁగవలెనా

(॥తరు॥)
వేడుకకు నవ్వితేను వెంగెమనీ యిదియేమే
వాడుమోము చూచితేను వంచుకోనేలే
చూడవే తా నంతే కడు సుద్దాత్ముఁ డైతేను
వోడక తా నొక్కరీతి నుండవలదా

(॥తరు॥)
దగ్గరఁ గూచుండితేను తప్పించుకో నదియేలే
వొగ్గి చెనకితే నట్టె సిగ్గు లేఁటికే
యెగ్గులుఁ దప్పులుఁ దాను యెరఁగనివాఁడైతే
దిగ్గన నా మాఁట సమ్మతించి వుండవలదా

(॥తరు॥)
చేరి మొక్కుమొక్కితేను చెక్కు నొక్కి వేఁడనేలే
గారవించఁగాఁ బెనఁగఁగ నేఁటికి
యీరీతినుండి శ్రీవేంకటేశుఁడు న న్నిప్పుడేలె
మేరమీర కిటులానే మెలఁగఁగవలదా

(||pallavi||)
taruṇilo nā manasu tā nĕram̐gam̐ḍā
tĕradīsi ne niṁta tĕlubam̐gavalĕnā

(||taru||)
veḍugagu navvidenu vĕṁgĕmanī yidiyeme
vāḍumomu sūsidenu vaṁchugonele
sūḍave tā naṁte kaḍu suddātmum̐ ḍaidenu
voḍaga tā nŏkkarīdi nuṁḍavaladā

(||taru||)
daggaram̐ gūsuṁḍidenu tappiṁchugo nadiyele
vŏggi sĕnagide naṭṭĕ siggu lem̐ṭige
yĕggulum̐ dappulum̐ dānu yĕram̐ganivām̐ḍaide
diggana nā mām̐ṭa sammadiṁchi vuṁḍavaladā

(||taru||)
seri mŏkkumŏkkidenu sĕkku nŏkki vem̐ḍanele
gāraviṁcham̐gām̐ bĕnam̐gam̐ga nem̐ṭigi
yīrīdinuṁḍi śhrīveṁkaḍeśhum̐ḍu na nnippuḍelĕ
meramīra kiḍulāne mĕlam̐gam̐gavaladā