తరుణికి నింత కూళతనములు చెల్లునా
(॥పల్లవి॥)
తరుణికి నింత కూళతనములు చెల్లునా
పొరిఁ బొరి చెలులాల బుద్ది చెప్పఁ గదరే
(॥తరు॥)
నిలిచి యాతఁడు నేను నేస్తములు చేకోఁగా
పొలతి తా నేల వచ్చి పొత్తు గూడీనే
మలసి మాలో మేము మంతనము లాడుకోఁగా
చలపట్టి యీకె యేల సాకిరి చెప్పినే
(॥తరు॥)
ననిచి వొండొరులము నవ్వులు నవ్వుకోఁగా
పనివడీ యా పేల తప్పక చూచీనే
అనువుగా మాయంత నే మద్దములుచూచుకొంటే
చొనిపి తనరూ పేమి చూప వచ్చినే
(॥తరు॥)
శ్రీ వేంకటేశుడు నేనుఁ జేకొని కూడఁగాను
వాపు లప్పటి తానేల వచ్చి చెప్పినే
చేవ మీర మాకువకే సేసలు చల్లుకోఁగా
పూవులఁ గొని తానేల పూఁచి వేసీనే
(||pallavi||)
taruṇigi niṁta kūḽadanamulu sĕllunā
pŏrim̐ bŏri sĕlulāla buddi sĕppam̐ gadare
(||taru||)
nilisi yādam̐ḍu nenu nestamulu segom̐gā
pŏladi tā nela vachchi pŏttu gūḍīne
malasi mālo memu maṁtanamu lāḍugom̐gā
salabaṭṭi yīgĕ yela sāgiri sĕppine
(||taru||)
nanisi vŏṁḍŏrulamu navvulu navvugom̐gā
panivaḍī yā pela tappaga sūsīne
anuvugā māyaṁta ne maddamulusūsugŏṁṭe
sŏnibi tanarū pemi sūba vachchine
(||taru||)
śhrī veṁkaḍeśhuḍu nenum̐ jegŏni kūḍam̐gānu
vābu lappaḍi tānela vachchi sĕppine
seva mīra māguvage sesalu sallugom̐gā
pūvulam̐ gŏni tānela pūm̐si vesīne