(॥పల్లవి॥)
తరుణికి మేర మీరఁ దగవౌనటే
వొరసి యాతఁడు గాఁగా నోరిచె నింతేసికి
(॥తరు॥)
చలముసాదించేవు సరసములాడుతానే
చలువుఁడేమో తొల్లిసేసెనంటాను
మెలఁగి పెనఁగఁగానే మేనెల్ల జీరలువారె
వొలసి యాతఁడు గాఁగానోరిచె నింతేసికి
(॥తరు॥)
నారువేసేవు కోపము నవ్వులు నవ్వుతానే
తేరకత్తె నెవ్వెతెనో తెచ్చెనంటాను
చేరి మాటలాడఁగానే చిల్లులువోయఁజిత్తము
వూరకే యాతఁడుగాఁగా నోరిచె నింతేసికి
(॥తరు॥)
గయ్యాళించేవు రతులఁగాఁగిటఁ గూడుతానే
నెయ్యపువిద్య లేడనో నేర్చెనంటాను
ఇయ్యెడ శ్రీవేంకటేశుఁ డెనయఁగానేలలసే
వొయ్యనే ఆతఁడుగాఁగా నోరిచె నింతేసికి
(||pallavi||)
taruṇigi mera mīram̐ dagavaunaḍe
vŏrasi yādam̐ḍu gām̐gā norisĕ niṁtesigi
(||taru||)
salamusādiṁchevu sarasamulāḍudāne
saluvum̐ḍemo tŏllisesĕnaṁṭānu
mĕlam̐gi pĕnam̐gam̐gāne menĕlla jīraluvārĕ
vŏlasi yādam̐ḍu gām̐gānorisĕ niṁtesigi
(||taru||)
nāruvesevu kobamu navvulu navvudāne
teragattĕ nĕvvĕdĕno tĕchchĕnaṁṭānu
seri māḍalāḍam̐gāne silluluvoyam̐jittamu
vūrage yādam̐ḍugām̐gā norisĕ niṁtesigi
(||taru||)
gayyāḽiṁchevu radulam̐gām̐giḍam̐ gūḍudāne
nĕyyabuvidya leḍano nersĕnaṁṭānu
iyyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍĕnayam̐gānelalase
vŏyyane ādam̐ḍugām̐gā norisĕ niṁtesigi