తరుణి చేసిన చేఁత తగవే కాదా
(॥పల్లవి॥)
తరుణి చేసిన చేఁత తగవే కాదా
సరికి బేసికి నిన్నుఁ జలము సాదించెను
(॥తరు॥)
ఇట్టె కానుకిచ్చి యాకె యెగుటనే వుండఁగాను
కట్టఁగడ యాపెనే చక్కఁ జూచేవు
దిట్టగనక యీకె నీ దిమ్మరి చేఁతలకు జేతఁ
బట్టిన నిమ్మపండు నీపై నిట్టె వేసెను
(॥తరు॥)
కేలువట్టుకున్నయాపె కిలకిల నవ్వఁగాను
మూలనున్న యాపెతోడ ముచ్చటాడేవు
తాలిమి గలదిగాన తగ నీ పరాకు దేర
కోలుముందుగా నిన్ను కొనగోర నొత్తెను
(॥తరు॥)
పోదిఁ గాఁగిలించినాపె పొంతనే వుండఁగాను
పాదమొత్తేయాపెను గొబ్బన గూడేవు
యీదెస శ్రీవేంకటేశ యీకె నేరుపరిగాన
మొదమున నీకు నిట్టె మొక్కు మొక్కి కూడెను
(||pallavi||)
taruṇi sesina sem̐ta tagave kādā
sarigi besigi ninnum̐ jalamu sādiṁchĕnu
(||taru||)
iṭṭĕ kānugichchi yāgĕ yĕguḍane vuṁḍam̐gānu
kaṭṭam̐gaḍa yābĕne sakkam̐ jūsevu
diṭṭaganaga yīgĕ nī dimmari sem̐talagu jedam̐
baṭṭina nimmabaṁḍu nībai niṭṭĕ vesĕnu
(||taru||)
keluvaṭṭugunnayābĕ kilagila navvam̐gānu
mūlanunna yābĕdoḍa muchchaḍāḍevu
tālimi galadigāna taga nī parāgu dera
kolumuṁdugā ninnu kŏnagora nŏttĕnu
(||taru||)
podim̐ gām̐giliṁchinābĕ pŏṁtane vuṁḍam̐gānu
pādamŏtteyābĕnu gŏbbana gūḍevu
yīdĕsa śhrīveṁkaḍeśha yīgĕ nerubarigāna
mŏdamuna nīgu niṭṭĕ mŏkku mŏkki kūḍĕnu