Taruni senagulu nee tanuvellaa nimdinavi

తరుణి చెనకులు నీ తనువెల్లా నిండినవి
Language

(॥పల్లవి॥)
తరుణి చెనకులు నీ తనువెల్లా నిండినవి
యిరుమేలాఁ జూడరాదా యెంత నీకీ మరపు

(॥॥)
నివ్వటిల్ల నీపె నేఁడు నిన్నుఁ బేరుకొని పిల్చీ
యెవ్వతెతో మాటలాడే వేమి సేసేవు
పువ్వుల వేసీఁ గమ్మటి పూఁచిపూఁచి యిందుకుఁగా
ఇవ్వల చూడఁగరాదా యేల నీకీమఱపు

(॥॥)
సముకాన నుండి యీకె సారె నిన్నుఁ జూడఁగాను
తమక మెచ్చట నుండీ తలఁ పెచ్చోట
గుమితాన నెరుకగా కొంగువట్టి తీసీని
అమరఁ బెండ్లాడరాదా అంతయేల మఱపు

(॥॥)
ననుపున నీకె నీతో నవ్వులెల్లా నవ్వఁగాను
పెనుఁగులాట లేవంక ప్రియ మేవంక
ఘనుఁడ శ్రీ వేంకటేశ కలసి నిన్నెచ్చరించీ
చనవు లియ్యఁగరాదా సరినేల మఱపు

(||pallavi||)
taruṇi sĕnagulu nī tanuvĕllā niṁḍinavi
yirumelām̐ jūḍarādā yĕṁta nīgī marabu

(||||)
nivvaḍilla nībĕ nem̐ḍu ninnum̐ berugŏni pilsī
yĕvvadĕdo māḍalāḍe vemi sesevu
puvvula vesīm̐ gammaḍi pūm̐sibūm̐si yiṁdugum̐gā
ivvala sūḍam̐garādā yela nīgīmaṟabu

(||||)
samugāna nuṁḍi yīgĕ sārĕ ninnum̐ jūḍam̐gānu
tamaga mĕchchaḍa nuṁḍī talam̐ pĕchchoḍa
gumidāna nĕrugagā kŏṁguvaṭṭi tīsīni
amaram̐ bĕṁḍlāḍarādā aṁtayela maṟabu

(||||)
nanubuna nīgĕ nīdo navvulĕllā navvam̐gānu
pĕnum̐gulāḍa levaṁka priya mevaṁka
ghanum̐ḍa śhrī veṁkaḍeśha kalasi ninnĕchchariṁchī
sanavu liyyam̐garādā sarinela maṟabu