Taruni neeveṟugani tagavunnadaa

తరుణి నీవెఱుగని తగవున్నదా
Language

(॥పల్లవి॥)
తరుణి నీవెఱుగని తగవున్నదా
గరిమ శృంగార మంగడిఁ బెట్ట నేఁటికే

(॥తరుణి॥)
మోవితేనెకు మదనముద్రలు వెట్టె విభుఁడు
యీవల నీముద్దుమాటలేల చిందేవే
కావించి నెరిదేఁటుల కరపద్మమున దాఁచె
కావరాన ముఖచంద్రుఁ గదలించ నేఁటికే

(॥తరుణి॥)
చెక్కుల కళలరాశిఁ జేగోరి లచ్చెనవెట్టె
వెక్కసపు చూపులేల వెదచల్లేవే
జక్కవచన్నుల కంటసరుల దామెనఁగట్టె
పెక్కువ పులకలచే బెదరించ నేఁటికే

(॥తరుణి॥)
కందువైన రతులెల్లా కాఁగిట బండారించె
అందెంది వూర్పులేల బయట వేసేవే
పొంది శ్రీవేంకటేశుఁడు పుక్కిట వీడెము నించె
చెందిన చొక్కుఁజెమట చిలుకఁగ నేఁటికే

(||pallavi||)
taruṇi nīvĕṟugani tagavunnadā
garima śhṛṁgāra maṁgaḍim̐ bĕṭṭa nem̐ṭige

(||taruṇi||)
movidenĕgu madanamudralu vĕṭṭĕ vibhum̐ḍu
yīvala nīmuddumāḍalela siṁdeve
kāviṁchi nĕridem̐ṭula karabadmamuna dām̐sĕ
kāvarāna mukhasaṁdrum̐ gadaliṁcha nem̐ṭige

(||taruṇi||)
sĕkkula kaḽalarāśhim̐ jegori lachchĕnavĕṭṭĕ
vĕkkasabu sūbulela vĕdasalleve
jakkavasannula kaṁṭasarula dāmĕnam̐gaṭṭĕ
pĕkkuva pulagalase bĕdariṁcha nem̐ṭige

(||taruṇi||)
kaṁduvaina radulĕllā kām̐giḍa baṁḍāriṁchĕ
aṁdĕṁdi vūrbulela bayaḍa veseve
pŏṁdi śhrīveṁkaḍeśhum̐ḍu pukkiḍa vīḍĕmu niṁchĕ
sĕṁdina sŏkkum̐jĕmaḍa silugam̐ga nem̐ṭige