తరుణి నైనా నేను దయ లేనిదాననా
(॥పల్లవి॥)
తరుణి నైనా నేను దయ లేనిదాననా
వెరవుతో నీ వుండఁగా వేగిరింతునా
(॥తరుణి॥)
మొగము చూచి నాకు మందట నిలుచుండఁగా
పొగరుముంపున నిన్నుఁ బో మ్మందునా
నిగిడి నీవొళ్లఁ దొల్లి నేర మేమి గలిగినా
పగటున నప్పు డట్టె పంగింతునా
(॥తరుణి॥)
మంచివానిలె నాతో మాట లిట్టె యాడఁ గాను
చంచలించి నిన్ను వద్దు చాలు నందునా
యెంచుకొని నీ వెవ్వతెయింట నుండి వచ్చినాను
మంచ మెక్కి యింక నీతో మారుకొనేనా
(॥తరుణి॥)
కడుఁ జుట్టమ వై నన్నుఁ గాఁగిటిలోఁ గలయఁగా
జడిసి వేడుక చెల్లించక వుందునా
అడరి శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
వడి నన్నుఁ గూడితివి వాసులు వట్టుదునా
(||pallavi||)
taruṇi nainā nenu daya lenidānanā
vĕravudo nī vuṁḍam̐gā vegiriṁtunā
(||taruṇi||)
mŏgamu sūsi nāgu maṁdaḍa nilusuṁḍam̐gā
pŏgarumuṁpuna ninnum̐ bo mmaṁdunā
nigiḍi nīvŏḽlam̐ dŏlli nera memi galiginā
pagaḍuna nappu ḍaṭṭĕ paṁgiṁtunā
(||taruṇi||)
maṁchivānilĕ nādo māḍa liṭṭĕ yāḍam̐ gānu
saṁchaliṁchi ninnu vaddu sālu naṁdunā
yĕṁchugŏni nī vĕvvadĕyiṁṭa nuṁḍi vachchinānu
maṁcha mĕkki yiṁka nīdo mārugŏnenā
(||taruṇi||)
kaḍum̐ juṭṭama vai nannum̐ gām̐giḍilom̐ galayam̐gā
jaḍisi veḍuga sĕlliṁchaga vuṁdunā
aḍari śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
vaḍi nannum̐ gūḍidivi vāsulu vaṭṭudunā