Taruni kimta salamu tagavu gaadu

తరుణి కింత చలము తగవు గాదు
Language

(॥పల్లవి॥)
తరుణి కింత చలము తగవు గాదు
సరుగ నాతనిమాఁట సమ్మతించవే

(॥తరు॥)
తడవితే నొడ్డుకొంటా తరితీపుసేసుకొంటా
వుడుకఁబెట్టేవు మోహ మొక్కమాఁటే
బడలె నీరమణుఁడు పంతము నీకుఁ జెల్లె
యెడయ కింతటనైనా యింపు చల్లవే

(॥తరు॥)
పిలిచితే బిగుసుతా ప్రియము చెప్పించుకొంటా
కలయ నూరేవు నవ్వు కడుఁగడు
అలవిమీరె నాతఁడు అమరె నీరాజసము
సొలసి యింతటనైనాఁ జొక్కించవే

(॥తరు॥)
కదిసితేఁ దిట్టుతాను కందువలు రేఁచుకొంటా
వెదచల్లేవు సిగ్గులు వేడుకతోడ
చెదరకుండా నిన్ను శ్రీవేంకటేశుఁడుఁ గూడె
పొదలి ఇంతటనైనాఁ బొసఁగుండవే

(||pallavi||)
taruṇi kiṁta salamu tagavu gādu
saruga nādanimām̐ṭa sammadiṁchave

(||taru||)
taḍavide nŏḍḍugŏṁṭā taridībusesugŏṁṭā
vuḍugam̐bĕṭṭevu moha mŏkkamām̐ṭe
baḍalĕ nīramaṇum̐ḍu paṁtamu nīgum̐ jĕllĕ
yĕḍaya kiṁtaḍanainā yiṁpu sallave

(||taru||)
piliside bigusudā priyamu sĕppiṁchugŏṁṭā
kalaya nūrevu navvu kaḍum̐gaḍu
alavimīrĕ nādam̐ḍu amarĕ nīrājasamu
sŏlasi yiṁtaḍanainām̐ jŏkkiṁchave

(||taru||)
kadisidem̐ diṭṭudānu kaṁduvalu rem̐sugŏṁṭā
vĕdasallevu siggulu veḍugadoḍa
sĕdaraguṁḍā ninnu śhrīveṁkaḍeśhum̐ḍum̐ gūḍĕ
pŏdali iṁtaḍanainām̐ bŏsam̐guṁḍave