తరుణి జవ్వనపుఁ దపము సేయఁగను
(॥పల్లవి॥)
తరుణి జవ్వనపుఁ దపము సేయఁగను
వరుసతోడ జాతివైరము లుడిగె
(॥॥)
జక్కవపులుగులు జంటవాయవివె
గక్కన వెన్నెలగాసినను
యెక్కడఁ గోవిల యెలుఁగులు చెదరవు
గుక్కక వానలు గురిసినను
(॥॥)
గుంపుఁదుమ్మెదలు గొబ్బున బెదరవు
సంపెఁగతావులు చల్లినను
ముంపునఁ జకోరములు వసివాడవు
సొంపుఁగళలు పెనుసూర్యుఁ డుండఁగను
(॥॥)
చిలుకలు సందడి సేసినఁ దొలఁగవు
కలసిన సమరతికయ్యమున
యెలమిని శ్రీ వేంకటేశుఁడు గూడఁగ
చెలియంగములని చెప్పఁగఁ బొసఁగె
(||pallavi||)
taruṇi javvanabum̐ dabamu seyam̐ganu
varusadoḍa jādivairamu luḍigĕ
(||||)
jakkavabulugulu jaṁṭavāyavivĕ
gakkana vĕnnĕlagāsinanu
yĕkkaḍam̐ govila yĕlum̐gulu sĕdaravu
gukkaga vānalu gurisinanu
(||||)
guṁpum̐dummĕdalu gŏbbuna bĕdaravu
saṁpĕm̐gadāvulu sallinanu
muṁpunam̐ jagoramulu vasivāḍavu
sŏṁpum̐gaḽalu pĕnusūryum̐ ḍuṁḍam̐ganu
(||||)
silugalu saṁdaḍi sesinam̐ dŏlam̐gavu
kalasina samaradigayyamuna
yĕlamini śhrī veṁkaḍeśhum̐ḍu gūḍam̐ga
sĕliyaṁgamulani sĕppam̐gam̐ bŏsam̐gĕ