Taruni bhaagyamu mari taṟavaadi panulellaa

తరుణి భాగ్యము మరి తఱవాతి పనులెల్లా
Language

(॥పల్లవి॥)
తరుణి భాగ్యము మరి తఱవాతి పనులెల్లా
నెరవేరిచి యేలేది నీచేతి దిఁకను

(॥తరు॥)
సారె నీమొగము చూచే జలజాక్షి గొంతవడి
కూరిములే చల్లె నీపైఁ గొంతవడి
చేరి నీసుద్దులు చెప్పెఁ జెలులతోఁ గొంతవడి
నేరుపు లిందాఁకాఁ జూపె నీచేతి దిఁకను

(॥తరు॥)
అక్కడక్కడనే వుండి ఆసచేసెఁ గొంతవడి
గుక్కిగుక్కినవ్వు నవ్వెఁ గొంతవడి
మొక్కెను చేతులెత్తి మునుకొని కొంతవడి
నెక్నొని మన్నించేది నీచేతి దిఁకను

(॥తరు॥)
చెలఁగి వద్దికి వచ్చి చెక్కునోక్కెఁ గొంతవడి
కొలువులుసేసె నీకుఁ గొంతవడి
అలమేలుమంగపతివైన శ్రీవేంకటేశ్వర
నెలఁత నేలితి వింతా నీచేతి దిఁకను

(||pallavi||)
taruṇi bhāgyamu mari taṟavādi panulĕllā
nĕraverisi yeledi nīsedi dim̐kanu

(||taru||)
sārĕ nīmŏgamu sūse jalajākṣhi gŏṁtavaḍi
kūrimule sallĕ nībaim̐ gŏṁtavaḍi
seri nīsuddulu sĕppĕm̐ jĕluladom̐ gŏṁtavaḍi
nerubu liṁdām̐kām̐ jūbĕ nīsedi dim̐kanu

(||taru||)
akkaḍakkaḍane vuṁḍi āsasesĕm̐ gŏṁtavaḍi
gukkigukkinavvu navvĕm̐ gŏṁtavaḍi
mŏkkĕnu sedulĕtti munugŏni kŏṁtavaḍi
nĕknŏni manniṁchedi nīsedi dim̐kanu

(||taru||)
sĕlam̐gi vaddigi vachchi sĕkkunokkĕm̐ gŏṁtavaḍi
kŏluvulusesĕ nīgum̐ gŏṁtavaḍi
alamelumaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
nĕlam̐ta nelidi viṁtā nīsedi dim̐kanu