తఱితో నీచేతిదింతే ధర్మపుణ్యము
(॥పల్లవి॥)
తఱితో నీచేతిదింతే ధర్మపుణ్యము
యెఱుఁగుదు మన్నియు నిన్నేమనేమయ్యా
(॥తఱి॥)
చెక్కిటిచేతితోడ సిగ్గులనవ్వులతోడ
తక్కక చెలి యింటిలో తా నున్నది
చొక్కటాలాడేవు నీవు సుదతులతో యీడ
యిక్కడ నిందరము నిన్నేమనేమయ్యా
(॥తఱి॥)
సింగారభావాలతోడ చెంపచెమటలతోడ
అంగన మేడలోన ఆసాస నున్నది
ముంగిటనీవైతేను కమ్ముక రచ్చలు సేసేవు
ఇంగితము గంటిమి నిన్నేమనేమయ్యా
(॥తఱి॥)
కన్నులతేటలతోడ కడుఁదమకముతోడ
యెన్నిక నీకాఁగిటిలో యింతి వున్నది
మన్నించి శ్రీవేంకటేశ మంచముపై నున్నాఁడవు
యిన్నిటాను జాణఁడవు నిన్నేమనేమయ్యా
(||pallavi||)
taṟido nīsedidiṁte dharmabuṇyamu
yĕṟum̐gudu manniyu ninnemanemayyā
(||taṟi||)
sĕkkiḍisedidoḍa siggulanavvuladoḍa
takkaga sĕli yiṁṭilo tā nunnadi
sŏkkaḍālāḍevu nīvu sudadulado yīḍa
yikkaḍa niṁdaramu ninnemanemayyā
(||taṟi||)
siṁgārabhāvāladoḍa sĕṁpasĕmaḍaladoḍa
aṁgana meḍalona āsāsa nunnadi
muṁgiḍanīvaidenu kammuga rachchalu sesevu
iṁgidamu gaṁṭimi ninnemanemayyā
(||taṟi||)
kannuladeḍaladoḍa kaḍum̐damagamudoḍa
yĕnniga nīgām̐giḍilo yiṁti vunnadi
manniṁchi śhrīveṁkaḍeśha maṁchamubai nunnām̐ḍavu
yinniḍānu jāṇam̐ḍavu ninnemanemayyā