Tarideebu livi vinam damagimchee naa manasu

తరితీపు లివి వినఁ దమకించీ నా మనసు
Language

(॥పల్లవి॥)
తరితీపు లివి వినఁ దమకించీ నా మనసు
సరుస నాకు మీరు సంతోసము సేయరే

(॥॥)
యేమని చెప్పెంపునొకో యింతితోడ నా విభుఁ డు
నా మాట లెల్ల విని నవ్వునొకో
కామించి నే నంపిన కాని కందుకొనునొకో
చేముంచి యీ విచారము చెప్పరే వోచెలులు

(॥॥)
వెలయ నీ పాటికి విన్నపము లందునొకో
తలఁపు లోపల దయ దలఁచునొకో
చెలరేఁగి యిప్పుడే సింగారించుకొనునొకో
యెలమి నూహించి నాతో నెంచరే యీ యెన్నికా.

(॥॥)
వడిగాఁ బల్లకీ యెక్కి వాకిటికి వచ్చునొకో
తడవి ఇంటిలోఁ దొల్లి తా నున్నాఁడొకో
యెడయక శ్రీ వేంకటేశుఁ డిదె నన్నుఁగూడె
అడరి యీతని సుద్దు లబ్బురాలు గదవే

(||pallavi||)
taridību livi vinam̐ damagiṁchī nā manasu
sarusa nāgu mīru saṁtosamu seyare

(||||)
yemani sĕppĕṁpunŏgo yiṁtidoḍa nā vibhum̐ ḍu
nā māḍa lĕlla vini navvunŏgo
kāmiṁchi ne naṁpina kāni kaṁdugŏnunŏgo
semuṁchi yī visāramu sĕppare vosĕlulu

(||||)
vĕlaya nī pāḍigi vinnabamu laṁdunŏgo
talam̐pu lobala daya dalam̐sunŏgo
sĕlarem̐gi yippuḍe siṁgāriṁchugŏnunŏgo
yĕlami nūhiṁchi nādo nĕṁchare yī yĕnnigā.

(||||)
vaḍigām̐ ballagī yĕkki vāgiḍigi vachchunŏgo
taḍavi iṁṭilom̐ dŏlli tā nunnām̐ḍŏgo
yĕḍayaga śhrī veṁkaḍeśhum̐ ḍidĕ nannum̐gūḍĕ
aḍari yīdani suddu labburālu gadave