Taṟi nimti ye meṟumgu tana yaasodame pemchee

తఱి నింతి యే మెఱుఁగు తన యాసోదమే పెంచీ
Language

(॥పల్లవి॥)
తఱి నింతి యే మెఱుఁగు తన యాసోదమే పెంచీ
నెఱవాది వింతట మన్నించవలెఁగాక

(॥తఱి॥)
కొసరి కొసరి నిన్నుఁ గొంగువట్టి తీసితీసి
అసురుసులై చెలి యలసీ నదె
వసముగాని పతిని వంచుకొనఁబోతేను
సుసరమా నీవే దయఁజూడవలెఁగాక

(॥తఱి॥)
పిలిచి పిలిచి నీకుఁ బ్రియములు చెప్పి చెప్పి
చలిమి బలిమితోను జడిసీ నదె
తలఁపుకొలఁదిగాని తగులమిఁ బెనఁగితే
నలవియౌనా నీవే యాదరింతుగాక

(॥తణి॥)
పొదిగి పొదిగి నీపొందు సేసికూడి కూడి
సదమదమై నవ్వు చల్లీ నదె
యిదె శ్రవేంకటేశ నీ వెనసితి విటుగాక
సదరమా యింకా నీవే చనవిత్తుగాక

(||pallavi||)
taṟi niṁti ye mĕṟum̐gu tana yāsodame pĕṁchī
nĕṟavādi viṁtaḍa manniṁchavalĕm̐gāga

(||taṟi||)
kŏsari kŏsari ninnum̐ gŏṁguvaṭṭi tīsidīsi
asurusulai sĕli yalasī nadĕ
vasamugāni padini vaṁchugŏnam̐bodenu
susaramā nīve dayam̐jūḍavalĕm̐gāga

(||taṟi||)
pilisi pilisi nīgum̐ briyamulu sĕppi sĕppi
salimi balimidonu jaḍisī nadĕ
talam̐pugŏlam̐digāni tagulamim̐ bĕnam̐gide
nalaviyaunā nīve yādariṁtugāga

(||taṇi||)
pŏdigi pŏdigi nībŏṁdu sesigūḍi kūḍi
sadamadamai navvu sallī nadĕ
yidĕ śhraveṁkaḍeśha nī vĕnasidi viḍugāga
sadaramā yiṁkā nīve sanavittugāga