తరి నిధానము గన్నదాఁకా దరిద్రంబు
(॥పల్లవి॥)
తరి నిధానము గన్నదాఁకా దరిద్రంబు
స్థిరము గా కివి గనిన సిరు లేమి బ్రాఁతి
(॥తరి॥)
మొదల గోవింద యను మూడక్షరంబులును
పదిలముగ నోరఁ బనుపడు దాఁకానె
కదియుఁగా కాపదలు కలుషములు జీవులకు
చెదరుగా కివి గనిన సిరు లేమి బ్రాతి
(॥తరి॥)
నారాయణా యనెడి నాలుగక్షరములు
పేరుకొని నోరి కచ్చిన దాఁకానె
భూరిదుఃఖములు నలపులు సదా జీవులకు
చేరినా యవి గనిన సిరు లేమి బ్రాతి
(॥తరి॥)
వేంకటేశ్వర యనెడి వేదపంచాక్షరము
అంకురంబయి నోరి కవుదాఁకానె
జంకెనలు నలవు నలజడి గాక జీవులకు
యింక నివి గనిన సిరు లవి యేమి బ్రాతి
(||pallavi||)
tari nidhānamu gannadām̐kā daridraṁbu
sthiramu gā kivi ganina siru lemi brām̐ti
(||tari||)
mŏdala goviṁda yanu mūḍakṣharaṁbulunu
padilamuga noram̐ banubaḍu dām̐kānĕ
kadiyum̐gā kābadalu kaluṣhamulu jīvulagu
sĕdarugā kivi ganina siru lemi brādi
(||tari||)
nārāyaṇā yanĕḍi nālugakṣharamulu
perugŏni nori kachchina dām̐kānĕ
bhūriduḥkhamulu nalabulu sadā jīvulagu
serinā yavi ganina siru lemi brādi
(||tari||)
veṁkaḍeśhvara yanĕḍi vedabaṁchākṣharamu
aṁkuraṁbayi nori kavudām̐kānĕ
jaṁkĕnalu nalavu nalajaḍi gāga jīvulagu
yiṁka nivi ganina siru lavi yemi brādi