Taṟavaadimaamta lella dayya meṟumgu

తఱవాతిమాఁట లెల్ల దయ్య మెఱుంగు
Language

(॥పల్లవి॥)
తఱవాతిమాఁట లెల్ల దయ్య మెఱుంగు
యెఱఁగనిదాన నేను యేమందు నేనూ

(॥తఱవాతి॥)
మంతనము లాడుకొంటా మంచముపైఁ గేరుకొంటా
నింతదడవు నుండరా యిద్దరు మీరు
యింతలో నే రాఁగాను యెవ్వ రాపె యీ పెంటా
యెంత కెంత నన్నడిగే వే మందు నేను

(॥తఱవాతి॥)
అంగము లొరసుకొంటా నాకు మడి చిచ్చుకొంటా
యెంగిలి పొత్తందుకోరా యిద్దరు మీరు
సంగడి నేఁ గూచుండఁగా సతి నా చెలి యనుచు
యింగితానఁ బే రడిగే వే మందు నేను

(॥తఱవాతి॥)
కమ్మి కాఁగించుకోంటా కాయాలు మరచుకొంటా
యిమ్ములఁ గూడి యుండరా యిద్దరు మీరు
పమ్మి నే దగ్గరఁ గాను పైకొని నన్నుఁ గూడితి
వెమ్మెల శ్రీవెంకటేశ యే మందు నేను

(||pallavi||)
taṟavādimām̐ṭa lĕlla dayya mĕṟuṁgu
yĕṟam̐ganidāna nenu yemaṁdu nenū

(||taṟavādi||)
maṁtanamu lāḍugŏṁṭā maṁchamubaim̐ gerugŏṁṭā
niṁtadaḍavu nuṁḍarā yiddaru mīru
yiṁtalo ne rām̐gānu yĕvva rābĕ yī pĕṁṭā
yĕṁta kĕṁta nannaḍige ve maṁdu nenu

(||taṟavādi||)
aṁgamu lŏrasugŏṁṭā nāgu maḍi sichchugŏṁṭā
yĕṁgili pŏttaṁdugorā yiddaru mīru
saṁgaḍi nem̐ gūsuṁḍam̐gā sadi nā sĕli yanusu
yiṁgidānam̐ be raḍige ve maṁdu nenu

(||taṟavādi||)
kammi kām̐giṁchugoṁṭā kāyālu marasugŏṁṭā
yimmulam̐ gūḍi yuṁḍarā yiddaru mīru
pammi ne daggaram̐ gānu paigŏni nannum̐ gūḍidi
vĕmmĕla śhrīvĕṁkaḍeśha ye maṁdu nenu