Taravaadi panulellam daa neṟamgamdaa

తరవాతి పనులెల్లఁ దా నెఱఁగఁడా
Language

(॥పల్లవి॥)
తరవాతి పనులెల్లఁ దా నెఱఁగఁడా
బిరుదే నెరపుఁ గాక పిలిపించనేఁటికే

(॥॥)
గోరుకొన సోఁకకతొలుతే కోపగించేవాఁడు తాను
యీరీతి నుంగరము నా కేఁటి కంపెనే
వీరివారిమాటలకు వెఱ పింతగలవాఁడు
దారకుఁడై వుండుఁగాక దగ్గరి రానేఁటికే

(॥॥)
వీసము సేయనందుకే విడనాడేవాఁడు దాను
ఆసమాటలేల చెప్పియంపెనే నాఁడు
వాసిమెరమెచ్చులకు బయలీఁదించేటివాఁడు
వేసాన నే నున్నచోటు వెదకఁగనేఁటికే

(॥॥)
అండకు రాకమునుపే యంతా మఱచేవాఁడు
నిండినమోహము నాపై నించనేఁటికే
మెండగు శ్రీవేంకటాద్రిమేటి ఇట్టె నన్నుఁ గూడె
వుండినట్టేవుండి నన్ను వూరడించనేఁటికే

(||pallavi||)
taravādi panulĕllam̐ dā nĕṟam̐gam̐ḍā
birude nĕrabum̐ gāga pilibiṁchanem̐ṭige

(||||)
gorugŏna som̐kagadŏlude kobagiṁchevām̐ḍu tānu
yīrīdi nuṁgaramu nā kem̐ṭi kaṁpĕne
vīrivārimāḍalagu vĕṟa piṁtagalavām̐ḍu
dāragum̐ḍai vuṁḍum̐gāga daggari rānem̐ṭige

(||||)
vīsamu seyanaṁduge viḍanāḍevām̐ḍu dānu
āsamāḍalela sĕppiyaṁpĕne nām̐ḍu
vāsimĕramĕchchulagu bayalīm̐diṁcheḍivām̐ḍu
vesāna ne nunnasoḍu vĕdagam̐ganem̐ṭige

(||||)
aṁḍagu rāgamunube yaṁtā maṟasevām̐ḍu
niṁḍinamohamu nābai niṁchanem̐ṭige
mĕṁḍagu śhrīveṁkaḍādrimeḍi iṭṭĕ nannum̐ gūḍĕ
vuṁḍinaṭṭevuṁḍi nannu vūraḍiṁchanem̐ṭige