తరవాతి పనులెల్లాఁ దన చిత్తమే యెఱుఁగు
(॥పల్లవి॥)
తరవాతి పనులెల్లాఁ దన చిత్తమే యెఱుఁగు
ఇరవై వున్నాఁడు తన కెచ్చరించేదేమే
(॥తర॥)
పిలువఁగాఁ బిలువఁగా ప్రియములు సమకూరు
తలఁచఁగాఁ దలఁచఁగా తమి వుట్టును
చలపట్టి వలెనంటే సాదించవచ్చువలపు
కొలఁదిమీరి తన్ను నేఁ గొసరేదేమే
(॥తర॥)
చెనకఁగాఁ జెనకఁగా చిత్తములు గరఁగును
పెనఁగఁగా బెనఁగఁగా బెరయఁ(యుఁ?) బొందు
తనకే సమ్మతి యైతే తగులుఁ జుట్టరికము
వెనువెంటఁ దనకు నే విన్నవించేదేమే
(॥తర॥)
చూడఁగాఁ జూడఁగాను సురతకాంక్షలు వుట్టు
కూడఁగాఁ గూడఁగా గందుకొను ముదము
యాడనె శ్రీవేంకటేశుఁ డింతలోఁదా నన్నునేలె
జోడువాయ మిఁక మరి చొక్కించే దేమే
(||pallavi||)
taravādi panulĕllām̐ dana sittame yĕṟum̐gu
iravai vunnām̐ḍu tana kĕchchariṁchedeme
(||tara||)
piluvam̐gām̐ biluvam̐gā priyamulu samagūru
talam̐sam̐gām̐ dalam̐sam̐gā tami vuṭṭunu
salabaṭṭi valĕnaṁṭe sādiṁchavachchuvalabu
kŏlam̐dimīri tannu nem̐ gŏsaredeme
(||tara||)
sĕnagam̐gām̐ jĕnagam̐gā sittamulu garam̐gunu
pĕnam̐gam̐gā bĕnam̐gam̐gā bĕrayam̐(yum̐?) bŏṁdu
tanage sammadi yaide tagulum̐ juṭṭarigamu
vĕnuvĕṁṭam̐ danagu ne vinnaviṁchedeme
(||tara||)
sūḍam̐gām̐ jūḍam̐gānu suradagāṁkṣhalu vuṭṭu
kūḍam̐gām̐ gūḍam̐gā gaṁdugŏnu mudamu
yāḍanĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalom̐dā nannunelĕ
joḍuvāya mim̐ka mari sŏkkiṁche deme