Taravaadi panulellaam daane yeṟumgu

తరవాతి పనులెల్లాఁ దానే యెఱుఁగు
Language

(॥పల్లవి॥)
తరవాతి పనులెల్లాఁ దానే యెఱుఁగు
సిరులవిభుని కిట్టె చెప్పరే చెలులు

(॥తర॥)
మనసులోపలి చింత మాఁటలకు గుఱిగాదు
తనివోనితమకాలె తామే యెఱుఁగు
తనువులోపలికాఁక తచ్చిచూప గుణిగాదు
మునుపువెనకల నామోహమే యెఱుఁగు

(॥తర॥)
కన్నులచూపులయాస గట్టిసేయ గురిగాదు
కన్నెలాల నాకోరికలే యెఱుఁగు
పన్నినజవ్వన మిది పట్టిచూప గురిగాదు
వెన్నెలవంటినానివ్వెరగే యెఱుఁగు

(॥తర॥)
వాడిన నామోవితేనె వారవట్టగురిగాదు
సూడువట్టినట్టిపలుసోఁకు లెఱుఁగు
యీడనెశ్రీవేంకటేశుఁ డిట్టె విచ్చేసి నన్ను
కూడినకూటమి మేనిగుఱుతులే యెఱుఁగు

(||pallavi||)
taravādi panulĕllām̐ dāne yĕṟum̐gu
sirulavibhuni kiṭṭĕ sĕppare sĕlulu

(||tara||)
manasulobali siṁta mām̐ṭalagu guṟigādu
tanivonidamagālĕ tāme yĕṟum̐gu
tanuvulobaligām̐ka tachchisūba guṇigādu
munubuvĕnagala nāmohame yĕṟum̐gu

(||tara||)
kannulasūbulayāsa gaṭṭiseya gurigādu
kannĕlāla nāgorigale yĕṟum̐gu
panninajavvana midi paṭṭisūba gurigādu
vĕnnĕlavaṁṭinānivvĕrage yĕṟum̐gu

(||tara||)
vāḍina nāmovidenĕ vāravaṭṭagurigādu
sūḍuvaṭṭinaṭṭibalusom̐ku lĕṟum̐gu
yīḍanĕśhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ vichchesi nannu
kūḍinagūḍami meniguṟudule yĕṟum̐gu