(॥పల్లవి॥)
తరవాతి పనులకు తానే నేను
మరుతంత్రములోన మరియేఁటిమాటలే
(॥తర॥)
బలువు కొలఁదియే పంతము
చలము కొలఁదియే సాదింపులు
కలిమికొలఁదియే గర్వము
మలసి తనకు నాకు మరియేఁటిమాటలే
(॥తర॥)
మనసుకొలఁదియే మంగళము
చనవుకొలఁదియే సరసము
యెనసినకొలఁదివే యింపులు
మనవి సనవి చెల్లె మరియేఁటిమాటలే
(॥తర॥)
మచ్చికకొలఁదివే మంతనాలు
వచ్చినకొలఁదివే వాడికలు
ఇచ్చగించి శ్రీవేంకటేశుఁడే తా నన్నుఁ గూడె
మచ్చరములెల్లాఁ బాసె మరియేఁటిమాటలే
(||pallavi||)
taravādi panulagu tāne nenu
marudaṁtramulona mariyem̐ṭimāḍale
(||tara||)
baluvu kŏlam̐diye paṁtamu
salamu kŏlam̐diye sādiṁpulu
kalimigŏlam̐diye garvamu
malasi tanagu nāgu mariyem̐ṭimāḍale
(||tara||)
manasugŏlam̐diye maṁgaḽamu
sanavugŏlam̐diye sarasamu
yĕnasinagŏlam̐dive yiṁpulu
manavi sanavi sĕllĕ mariyem̐ṭimāḍale
(||tara||)
machchigagŏlam̐dive maṁtanālu
vachchinagŏlam̐dive vāḍigalu
ichchagiṁchi śhrīveṁkaḍeśhum̐ḍe tā nannum̐ gūḍĕ
machcharamulĕllām̐ bāsĕ mariyem̐ṭimāḍale